పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/146

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కాని సీమోను తన పాపాలకు పశ్చాత్తాపపడనూ లేదు, పాపక్షమను పొందనూలేదు, ఈమె క్రీస్తుకు మర్యాదచేసింది. సీమోను ఈ మర్యాద కూడ చేయలేదు. కనుక తాను నీతిమంతుణ్ణని యెంచే సీమోనుకంటె మరియయే ఉత్తమరాలని క్రీస్తుభావం - లూకా 7, 36-38.

యూదులు స్త్రీలను పనికత్తెలనుగా కొరగానివాళ్ళనుగా భావించేవాళ్ళు. కాని క్రీస్తు మాత్రం వాళ్ళను విలువతో జూచాడు. ఓసారి అతడు కానుకల పెట్టెవద్ద కూర్చుండి భక్తులు పెట్టెలో కానుకలు వేసే తీరును గమనిస్తున్నాడు. ఉన్నవాళ్ళ దానిలో పెద్దమొత్తాలే వేసారు. అంతలో ఓ పేద విధవ వచ్చి రెండు పైసలు మాత్రమే వేసింది. క్రీస్తు ఆమె త్యాగాన్ని మెచ్చుకొన్నాడు. ఈమె అందరికంటె ఎక్కువగా దానంజేసింది. తన జీవనాధారమంతా త్యాగం చేసింది అన్నాడు. ఆమె ఎవరికంటా బడకుండా, ఎవరిమెప్ప పొందకుండా దాటిపోయింది. కాని క్రీస్తు మాత్రం ఆమెను మెచ్చుకొన్నాడు - మార్కు 12, 41-44. , బెతనీ గ్రామంలో పాపాత్మురాలు పరిమళ తైలంతో ప్రభువు పాదాలు అభిషేకించింది. అక్కడి వాళ్ళకు ఆ కార్యం నచ్చలేదు. వాళ్ళు ఇంత పరిమళ ద్రవ్యాన్ని వృథాగా వ్యయంజేయడం ಡೆ:ತ್ರಿ? దీనినమ్మి పేదవాళ్ళకు దానం చేయవచ్చుగదా అన్నారు. కాని క్రీస్తు ఆ భక్తురాలి కోప తీసికొన్నాడు, "మీరు ఈమెను పీడించడం దేనికి? ఈమె నా భూస్థాపనాన్ని సూచిసూ నన్ను అభిషేకించింది. ఈ సువార్తను బోధించే తావులన్నిటిలోను ప్రజలు ఈమె పుణ్యకార్యాన్ని గూర్చి చెప్పకొంటారు" అన్నాడు - మార్కు 12, 41-44 ఓసారి అన్యజాతికి చెందిన స్త్రీ వొకతె వచ్చి తన బిడ్డకు పట్టిన దయ్యాన్ని పారదోలమని క్రీస్తుని వేడుకొంది. శిష్యులుకూడ ఆమె తరపున ప్రభువుకి సిఫార్పు చేసారు. క్రీస్తు ఇంటిలోని బిడ్డల రొట్టెను కుక్కలకు వేయకూడదన్నాడు. అనగా సొంతజాతి ప్రజలైన యూదులను వదలివేసి అన్యజాతి ప్రజలకు సేవలు చేయడం భావ్యం కాదని భావం, కాని ఆమె వినయంతో అయ్యా! భోజనపు బల్లమీదినుండి పిల్లలు పడవేసే రొట్టెముక్కలను ఆ బల్లక్రింది కుక్క పిల్లలు తింటాయికదా అంది. అనగా మీరు మొదట యూదులకే సేవలు చేయండి. అటుతర్వాత అన్యజాతి జనులమైన మాకు గూడ మీ సేవలు అందించండి అని భావం. ప్రభువు ఆమె వినయ విశ్వాసాలకు విస్తుపోయి అమ్మా! నీ విశ్వాసం గొప్పది. నీ బిడ్డ బ్రతుకుతుంది పో అని చెప్పాడు. ఇక్కడ క్రీస్తు ఈ యన్యజాతి స్త్రీ విశ్వాసాన్ని మెచ్చుకొన్నాడు — మత్త 15, 21–28. 140