పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/145

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మెచ్చుకొన్నాడు — లూకా 7, 47. ఈ పాపాత్ములందరితోను ప్రభువు వీళ్ళు కూడ ముఖ్యమైనవాళ్ళే అన్నట్లుగా ప్రవర్తించాడు.

రబ్బయులు బహిరంగంగా స్త్రీలతో మాట్లాడకూడదు. ఈ నియమాన్ని మీరి క్రీస్తు అందరియెదుట మహిళలతో మాట్లాడాడు. అలా అతడు సమరయ స్త్రీతో మాట్లాడ్డం జూచి శిష్యులే విస్తుపోయారు - యోహా 4, 27. స్త్రీలు రబ్బయుల దగ్గరికి రానేకూడదు. రబ్బయులను ఎంతమాత్రం ముట్టుకోగూడదు. కాని రక్తస్రావ రోగంతో బాధపడుతూ అశుద్ధురాలుగా గణింపబడిన స్త్రీ ప్రభువు అంగీ అంచును ముట్టుకొన్నా అతడు కోపించలేదు - లూకా 8,43-48. ఆలాగే పాపాత్మురాలు తన పాదాలను తాకినా అతడు నొచ్చుకోలేదు - 7, 38. అతనికి స్త్రీలపట్ల చిన్నచూపలేదు.

క్రీస్తు వ్యాధి నయంజేసిన మొదటి స్త్రీరోగి పేత్రు అత్త. ఆమె కృతజ్ఞతాపూర్వకంగా అతనికి భోజనం వడ్డించింది. అటుతర్వాత క్రీస్తు అనేక పర్యాయాలు పేత్రు అత్తనుండి ఆతిథ్యం స్వీకరించి వుండాలి - మత్త 8,14-15. అలాగే అతడు బెతనీ గ్రామంలో వసించే మరియా మార్తల యింటిలో గూడ ఆతిథ్యం పుచ్చుకొన్నాడు - లూకా 10,38-42. పేషిత ప్రయాణాల్లో కొందరు ಸ್ತಿಲು తమ డబ్బుతోనే అతనికి భోజనం సమకూర్చేవాళ్ళని ముందే చెప్పాం - లూకా 8,3. ఈ వుదాహరణలను అతడు స్త్రీలతో సులువుగా కలిసేవాడనీ వాళ్ళ పెట్టిన అన్నాన్నిగూడ ఆదరంతో భుజించేవాడనీ అర్థంజేసికోవాలి.

3. స్త్రీలను సమర్ధించడం, ప్రశంసించడం

యూద సమాజంలో స్త్రీలకు చాల అన్యాయాలు జరుగుతుండేవి. కనుక క్రీస్తవారి కోప తీసికొన్నాడు. వారిని మెచ్చుకొన్నాడు. ఒకోసారి తప్పుచేసిన స్త్రీలను గూడ సమర్ధించాడు. వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని యూదులు రాళ్ళతో కొట్టి చంపడానికి సిద్ధమయ్యాడు. క్రీస్తు మీలో తప్పలేనివాడు ఆమెమీద మొదటిరాయి వేయండి అన్నాడు. ఎవడూ ఆమెమీద రాయి విసరడానికి సాహసించలేదు. ఇక్కడ క్రీస్తు ఆమె పాపాన్ని సమర్ధించలేదు. పాపాత్మురాలిని సమర్ధించాడు. కరుణతో ఆమె తప్పిదాన్ని మన్నించాడు. కాని యూదుల పాపాలను మాత్రం వ్రేలెత్తి చూపాడు - యోహా 8, 7-11.

సీమోను ఇంటిలో క్రీస్తు పాదాలకు పరిమళ ద్రవ్యం పూసిన వ్యభిచారిణి మరియ కథకూడ ఈలాంటిదే. సీమోను ఈమెను పాపినిగా గణించి ఖండించాడు. కాని క్రీస్తు ఈమెను సమర్ధించాడు. ఈమె క్రీస్తు బోధను విని విశ్వసించింది. సీమోను అలా విశ్వసించలేదు. ఈమె పశ్చాత్తాపపడ్డం వల్ల ప్రభువు ఈమె పాపాలను మన్నించాడు.