పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/144

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

క్రొత్త గుడ్డకు మాసికవేయరు. అలావేస్తే మాసిక నిలువదు. ఆలాగే ప్రాతనిబంధనకూ క్రొత్త నిబంధనకూ పొత్తు కుదరదని క్రీస్తు భావం - 9, 16.

మనం ఎడతెగక దేవుణ్ణి వేడుకొంటూండాలి అని చెప్పడానికి క్రీస్తు పదేపదే న్యాయాధిపతి దగ్గరికి వెళ్లిన పేదరాలిని వుపమానంగా తీసికొన్నాడు. ఆమె మళ్లామల్లా న్యాయాధిపతిని సమీపించి తనకు న్యాయం చెప్పమని పీడించింది. కడన అతడు ఆమెకు అనుకూలంగా తీర్పు చెప్పాడు. మనం కూడా ఈ పేదరాలిలాగ విసుగూవిరామం లేకుండ దేవుణ్ణి అడుక్కోవాలని భావం - లూకా 18, 1-5.

ప్రజలు దైవరాజ్యంలో చేరడంలో ఆలస్యం చేయగూడదనీ వేగిరమే ఆ పనిని చేయాలనీ బోధించడానికి ప్రభువు పదిమంది కన్నెల కథ చెప్పాడు. వీరిలో ఐదుగురు సకాలంలో వివాహానికి వచ్చారు, ఐదుగురు ఆలస్యంగా వచ్చారు. ఈ రెండవ వర్గంవారికి ఆశాభంగం కలిగింది. ఈలాగ క్రీస్తు బోధలను సత్వరమే అంగీకరించని యూదులకు కూడా ఆశాభంగం కలుగుతుందని భావం - మత్త 25, 1-13. ఈలా స్త్రీల గృహకృత్యాలనుండీ సాంఘికాచారాలనుండీ ప్రభువు తన వుపమానాలను ఎన్నుకొన్నాడు. దీన్నిబట్టి అతనికి స్త్రీజాతి పట్ల ఎంతో ఆదరభావం వుందని అర్థంజేసికోవాలి.

2. స్త్రీలతో కలియడం

ఒకసారి తల్లలు పసిబిడ్డలను క్రీస్తు దగ్గరికి తీసికొని వచ్చి ఆ బిడ్డలను దీవించమని అడిగారు. మొదట శిష్యులు ఆ తల్లలను అడ్డగించారు. వాళ్ళను క్రీస్తు సమీపంలోనికి రానీయలేదు. మా గురువుగారు అలసిపోయి వున్నాడు వెళ్లిపొండి అన్నారు. కాని క్రీస్తు శిష్యులను కోపించి ఆ తల్లలను తనదగ్గరికి పిలిపించుకొన్నాడు. ఆ బిడ్డలను ఎత్తి కౌగిలించుకొని దీవించాడు. ఈలా అతడు స్త్రీలనీ చిన్నబిడ్డలనీ ఆదరణతో జూచాడు. శిష్యులు కూడ ఆ బిడ్డల్లాగే తయారు కావాలని మందలించాడు. శిశువులు తల్లిదండ్రుల మీద ఆధారపడి జీవించినట్లే వాళూ దేవునిమీద ఆధారపడి జీవించాలని బోధించాడు. యూద రబ్బయులు స్త్రీలకు దూరంగా వుండేవాళ్లు, దీనికి భిన్నంగా ప్రభువు స్త్రీలతో కలిసాడు - మార్కు 10, 13-16.

పాపాత్మురాళ్ళయిన స్త్రీలతో మెలిగేప్పడు గూడ క్రీస్తు చాల దయాపూర్వకంగా ప్రవర్తించేవాడు. వ్యభిచారంలో పట్టుబడిన మహిళతో "నేనుకూడా నీకు శిక్ష విధించను, ఇక వెళ్ళు. మళ్ళా పాపం చేయకు అని మృదువుగా పలికాడు - యోహా 8, 11. సమరయ స్త్రీతో మనసుకు నొప్పి కలగనట్లుగా సున్నితంగా మాట్లాడాడు. తన పాదాలను కన్నీటితో తడిపిన స్త్రీని ఈమె అధికంగా ప్రేమించి అధికంగా పాపపరిహారం పొందిందని