పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/134

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఐదవవర్గం వాళ్లయిన పంచములు బానిసలు, వెలివేతకు గురైనవాళ్లు, అంటరానివాళ్లు. కాని ఈ విభజనంలో అన్యాయం, కుట్ర, మోసం వున్నాయి. పాలస్తీనా దేశంలో కూడ నరులను ఎక్కువ తక్కువగా విభజించారు. దేవాలయంలో అర్చనచేసే ప్రధానయాజకుడు అందరికంటె గొప్పవాడు. అటుతర్వాత యాజకులూ లేవీయులూ వస్తారు. ఆ పిమ్మట యిస్రాయేలు పురుషులు, వారి తర్వాత యూదస్త్రీలు వస్తారు. కడపటివాళ్లు అన్యజాతి ప్రజలు. వంశాన్ని బట్టీ, వృత్తిని బట్టీ, పరిపూర్ణ శరీరావయవాలను ಬಟ್ಟೆ కూడ నరుల విలువను లెక్కకట్టేవాళ్లు, వికలాంగులు, రోగులు, నీచవృత్తుల్లో వుండేవాళ్లు అశుద్దులు. కాని క్రీస్తు అట్టడుగువర్గం వారితో కలసి భుజించి పై అధికార క్రమాన్ని రద్దుచేసాడు. అతని విలువలు వేరు. అతడు స్థాపించగోరిన నూత్నసమాజంలో నరులందరు సరిసమానం. ప్రతినరుడూ శుధుడే. ఒకరి మీద ఒకరు పెత్తనం చలాయించకూడదు. నాయకులు కూడ ఎక్కువవాళ్లు కాదు. ఇతరులకు సేవలు చేసేవాళ్లే అధికులు, మాన్యులు -మత్త23, 11 క్రీస్తు నెలకొల్పగోరిన నూత్న సమాజం దైవసమాజం. దానిలోఅందరఅన్నదమ్ములూ అక్కచెల్లెళల్లా, క్రీస్తుకూడ తోడినరులకు స్నేహితుడు, సేవకుడు - అంతే - యోహా 15,15. క్రీస్తు శిష్యులకు అతని విలువలు అర్థంకాలేదు. వాళ్లు దైవరాజ్యంలో మేము గొప్పంటే మేము గొప్పని కీచులాడుకొన్నారు. కాని అతడు "మీలో గొప్పవాడు కాదల్చుకొన్నవాడు మీకు పరిచారకుడై యుండాలి" అని చెప్పాడు - మార్కు 10, 43. వాళ్లు అప్పడు గూడ పాఠం నేర్చుకోకపోతే, అతడు స్వయంగా వారి కాళ్లు కడిగి అధికారక్రమం చెల్లదని రుజువు చేసాడు. దాని ద్వారా ఆ శిష్యుల హృదయాల్లోని అధికారక్రమంగూడ కడిగివేసినట్లయింది- యోహా 13,5. ఆ రోజుల్లో శిష్యులు గురువుల కాళ్లు కడిగేవాళ్లు, కాని గురువే శిష్యులకాళ్లు కడగడం అరుదైన సంఘటనం. ఈవిధంగా క్రీస్తు నరుల్లో హెచ్చుతగ్గులు, కులం విలువలూ, అధికారభావాలూ రూపుమాపాడు. అతని యీచర్య పాలస్తీనా దేశంలోని వర్గవ్యవస్థకూ, మన దేశంలోని కులవ్యవస్థకూ గొడ్డలి పెట్టు.

14. దళితులకు గౌరవాదరాలు

క్రీస్తు బడుగువర్గాల వారితో కలసి తిరిగి వారి విలువనూ గౌరవాన్నీ పెంచాడు. వారిమీద వారికే నమ్మకం కలిగించాడు. నరులందరిలాగే వాళ్లకూడ దేవుని బిడ్డలనినిరూపించాడు. మీరు ఎవరికీ బానిసలు కావద్దని వాళ్లను హెచ్చరించాడు. వారి మౌన