పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/133

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

11. వంశపవిత్రత చెల్లదు

యూదులూ, మన దేశీయులూ కూడా వంశపవిత్రతను ఘనంగా యెంచారు. యూదులు అబ్రాహాము వంశానికి చెందివుండడం గొప్ప అనుకొన్నారు. మనదేశంలో బ్రాహ్మణులు ఏదో ఋషిపరంపరకు చెందివుండడం గొప్ప అనుకొని గోత్రాలు ఏర్పాటు చేసికొన్నారు. అన్యులను వివాహమాడితే ఈ పవిత్రత చెడుతుందనుకొన్నారు. కాని క్రీస్తు ఈ వంశ పవిత్రతకు, జాతి పవిత్రతకు విలువనీయలేదు. అసలు క్రీస్తు వంశావళిలోనే అన్యజాతి స్త్రీలూ అపవిత్రులూ వున్నారు. అతడు ఈ యంశం తనకు కళంకం ఆపాదిస్తుంది అనుకోలేదు. తాను దావీదు వంశానికి చెందివుండడం గొప్ప అనుకోలేదు - మార్కు 12, 35-37.

యూదులు అబ్రాహాము వంశంలో పుట్టడమే ఘనకార్యం అనుకొన్నారు. కాని స్నాపకయోహాను, క్రీస్తుకూడ అబ్రాహాము సంతతి కావడంలో గొప్పయేమీ లేదన్నారు. విశ్వాసమూ పశ్చాత్తాపమూ మాత్రమే నరులను రక్షిస్తాయన్నారు — లూకా 3, 8–9. దేవుని చిత్తప్రకారం జీవించేవాళ్లు ఘనులు. ఆలాంటివాళ్లే క్రీస్తుకు తోబట్టవుల్లాంటివాళ్లు, రక్తబంధుత్వం ముఖ్యం కానేకాదు - మార్కు 8, 81-85. క్రీస్తు శిష్యులుకూడ రక్తబంధుత్వంతో గూడిన తమ కుటుంబాలకు అంటిపెట్టుకొని వుండకూడదు - మత్త 10,37.

రక్షణం విశ్వాసంద్వారా వస్తుందేకాని అబ్రాహాము సంతతి కావడంవల్ల రాదని క్రీస్తు చాలసార్లు చెప్పాడు. అతడు అన్యజాతివాళ్లయిన కననీయ మహిళ, రోమను సైన్యాధిపతి విశ్వాసాన్ని మెచ్చుకొన్నాడు. వీళ్లకు అబ్రాహాముతో ఏ సంబంధంలేదు. ప్రభువు యూదులు ఏవగించుకొనే సమరయులతో కలసిపోయి వారి భోజనాన్ని తిన్నాడు. శుద్ధిని పొందిన పదిమంది కుష్టరోగుల్లో దళితుడైన సమరయుడు మాత్రమే అతినికి వందనాలు చెప్పాడు. మంచి సమరయుని కథలో ఆదర్శవ్యక్తి సమరయుడు కాని యాజకుడూ లేవీయుడూ కారు. ఐతే మం అగ్రకులాలకు విలువనిస్తున్నాం.

2. పరిస్థితులు తారుమారు కావడం

యూదులు, మన దేశంలో హిందువులు కూడ పావంవల్ల వ్యాధివస్తుందనుకొన్నారు. ఇది ఒకరకమైన కర్మవాదం. క్రీస్తు ఈ వాదం పొసగదన్నాడు.అతడు రోగులను విశ్రాంతి దినానకూడనయంజేసాడు. వారి పాపాలకూ వారి రోగాలకూసంబంధం లేదన్నాడు. గ్రుడ్డివాడు తన పాపాలవల్లగాని తన తల్లిదండ్రుల పాపాల వల్లగానిగ్రుడ్డివాడు కాలేదని చెప్పాడు - యోహా 9,2. పరిసయుడు సుంకరి కథలో సుంకరి