పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/135

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చండాలుడు. ఐనా దేవుడు అతని పూజనే అంగీకరించాడు. కనుక జాతి ముఖ్యంగాదు. అగ్రజాతి, అధమజాతి అనేవి లేవు. మండల్ కమీషన్ వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్ వండాలని సిఫార్పు చేసింది. క్రీస్తు కూడ ఈ సిఫార్పు ఆమోదిస్తాడు.

క్రీస్తు పరిస్థితులు తారుమారైన సామెతలు కొన్ని చెప్పాడు. మంచి సమరయుని సామెతలో కడపట వచ్చినవాడూ, నీచజాతివాడు ఐన సమరయుడు పూజ్యడు. యాజకుడూ లేవీయుడూ మాన్యులు కారు. లాజరు ధనికుడు కథలోను, వివాహవిందు కథలోను ధనికులుగాక పేదలు ఆదరణను పొందారు, ద్రాక్షతోట కూలీల కథలో చివరవచ్చినవాళ్లకు మంచిజీతం మట్టింది.

దేవాలయంలో దళిత వర్గానికి చెందిన పేదరాలు చేసిన దానం ధనికులదానం కంటె గొప్పది — లూకా 21, 1–4. ప్రభువు చాలసార్లు కడపటివాళ్లు మొదటివాళ్లు, మొదటివాళ్ల కడపటివాళ్లు ఔతారని చెప్పాడు — మత్త 19, 30. మనం అట్టడగువర్గంవారికి చేసిన సేవలు తనకే చెందుతాయని గూడ చెప్పాడు - మత్త 25,40. క్రీస్తు శిశువుని మొదట దర్శించింది యెరూషలేము జ్ఞానులూ నాయకులుకాదు. పామరులయిన గొర్రెల కాపరులు. మరియ మహిమగీతం పెద్ద విప్లవగీతం. దానిలో ఆమె, దేవుడు అధిపతులను ఆసనాలనుండి పడద్రోసి దీనులను లేవనెత్తుతాడని చెప్పింది - లూకా 1, 52. క్రీస్తు తన దైవరాజ్య ప్రణాళికను ప్రకటించినపుడు ఏమన్నాడు? పేదలకు సువార్త బోధింపబడుతుంది అన్నాడు. చెరలో నున్నవారికి విడుదల, గ్రుడ్డివారికి చూపు, పీడితులకు విమోచనం లభిస్తుంది అన్నాడు. వీళ్లే నేటిదళితులు. సుంకరులు జారిణులు అగ్రవర్గాల వారికంటె ముందుగానే దైవరాజ్యంలో ప్రవేశిస్తారు. తండ్రిదైవరాజ్యరహస్యాలను విజ్ఞలకు కాక పసిబిడ్డలను ఎరిగిస్తాడు - మత్త 11, 25. దళితుడైన ప్రభువు దళితుల కోపు తీసికొన్నాడు. వారిని సమర్ధిస్తూ మాటలాడాడు. వారికి అనుకూలంగా తీర్పుచెప్పాడు.

5. ప్రాత మతవిలువల్లో మార్పులు

13. అధికార క్రమాన్ని రద్దుచేయడం

మన దేశంలో అధికార క్రమం వుంది. సమాజంలో ఎక్కువ విలువగలవాళ్లు తక్కువ విలువగలవాళ్లు వున్నారు. మన దేశంలో బ్రాహ్మణులది అగ్రస్థానం. వీళు యాజకులు. దేవుళ్లతో సమానమైన భూదేవుళ్లు, మానవాతీతులు. వీళ్ల తర్వాత క్షత్రియలూ, వారి తర్వాత వైశ్యులూ వస్తారు. వారి తర్వాత వ్యవసాయంజేసే శూద్రులు వస్తారు.