పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/98

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దేవుడు మన ఆహారాన్ని మనకు దయచేస్తాడు. ఇట్లంటే మనం సోమరులంగా వుండిపోవచ్చునని భావం కాదు. పునీత ఇగ్నేప్యసుగారు చెప్పినట్లు, మనం అంతా మనమీదనే ఆధారపడి వుందో అన్నట్లు పనిచేయాలి. కాని అంతా దేవునిమీదనే ఆధారపడి వుందో అన్నట్లు అతన్నినమ్మాలి. మనం చేసిన పనివల్లనే భోజనాన్ని పొందడానికి అర్హలం కాము. దేవుడు మనకు దాన్ని ఉచితంగానే దయచేస్తాడు. కనుక ఆహారాన్ని ఎప్పడూ కృతజ్ఞతా భావంతో స్వీకరించాలి. అందుకే భోజనానికి ముందూ వెనుక జపం చెప్తాం.

ఈ విన్నపంలో పేర్కొనే "భోజనం" మామూలు అన్నాన్నేగాక దివ్యసత్ర్పసాద భోజనాన్నీ వాక్యభోజనాన్నీ గూడ సూచిస్తుంది. నరుడు వట్టి ఆహారం చేతనే జీవించడు. దేవుడు పలికే ప్రతి వాక్కువలనా జీవిస్తాడు - మత్త 4,4. కనుక క్రైస్తవులు ఎప్పడూ పేదలకు సువార్తను బోధించాలి. దేశంలో ఎప్పడూ కరువు వుంటుంది, ఆ కరువు కూటికీ నీటికీ కాదు. ప్రభువు వాక్కుకే - ఆమోసు 8, 11. కనుక దైవవాక్కును ఎప్పుడూ ప్రకటిస్తూనే వుండాలి. వాక్కుదివ్యసత్రసాదమూ కూడ మన భోజనాలు. ప్రస్తుత విన్నపం ఈ రెండు భోజనాలను గూడ పేర్కొంటుంది.

"నేటికి" కావలసిన మా అనుదిన భోజనాన్ని దయచేయమని వేడుకొంటున్నాం. ఈ “నేడు" అనే పదం దేవునిపట్ల మన కుండవలసిన నమ్మకాన్ని సూచిస్తుంది. అతడు ఏ అన్నం ఆ రోజు మనకు దయచేస్తాడు. మనం అతన్ని నమ్మవచ్చు. ఏ యాందోళనమూ అక్కర్లేదు.

“అనుదిన" భోజనం అంటున్నాం. “అనుదినం" అనే మాటకు కాలం అని ఒక అర్థం. దేవుడు ఏ రోజు భోజనం ఆ రోజు దయచేస్తాడు కనుక మనం అతన్ని నమ్మి ఆ భోజనాన్ని స్వీకరిస్తాం. ఇంకా, అనుదినం అనే మాటకు ఫలానాలాంటి భోజనం అని కూడ అర్థముంది. ఈ భావాన్ని తీసికొంటే, దేవుడు మన జీవితానికి అవసరమైన వస్తువులన్నీ దయచేయాలని భావం. ఐతే ఇక్కడ ఈ అనుదినం అనే మాట ప్రధానంగా దివ్యసత్రసాదాన్ని సూచిస్తుంది. అది మనకు అమరత్వాన్ని దయచేసే మందు. అది లేందే మనకు జీవం లేదు. అసలు మన భోజనం క్రీస్తే. ఆ క్రీస్తనే దివ్యభోజనాన్ని దయచేయమని మనం తండ్రిని వేడుకోవాలి.

ఈ భోజనాన్ని మనకు "దయచేయమని" దేవుణ్ణి నమ్మకంతో అడుగుతున్నాం. ఆ తండ్రి మంచివాడు. మనకు కావలసిన వాటినన్నిటినీ అతనినుండే అడుగుకొంటాం. అతడు దుర్జనులకూ సజ్జనులకూగూడ తన సూర్యరశ్మినీ వర్షాన్నీ దయచేస్తాడు. అనగా ఎవరినీ కేటాయించడు - మత్త 5,45. ఇంకా అతడు ప్రతిప్రాణికీ సకాలంలో తిండిపెట్టేవాడు - కీర్త 104,27. దేవుడు యోగ్యడైన తండ్రి. అతడు పూర్వమే మనతో