పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/99

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నిబంధనం చేసికొన్నాడు. ఆ ప్రభువు మనకూ, మనం అతనికీ చెందివుంటాం. ఈలాంటి తండ్రినుండి మనం నమ్మకంతో వినయంతో ఆహారం అడుగుకొంటున్నాం.

 కడన "మాకు” అంటున్నాం. దేవుడు అందరికీ తండ్రి. అందరికీ భోజనం అవసరం, కనుక మనం అందరికొరకు విన్నపం చేస్తున్నాం. ఈలా ఈ వాక్యంలో ప్రతి పదానికీ అర్థముంది.

5. మాయొద్ద అప్పబడినవారిని మేము క్షమించినట్లే

    ఈ విన్నపంలో ఓ షరతు వుంది. మనం ఇతరులను క్షమిస్తేనే దేవుడు మనలను క్షమించేది. ఈ షరతు ముఖ్యమైంది. ఈ విన్నపంలో "అప్పులు" అంటే తప్పిదాలనే భావం.
    పూర్వ విన్నపంలో నీ నామం పవిత్రపరచబడును గాక అని దేవునితో చెప్పాం. మనం పవిత్రులం కావడం ద్వారానే దేవుని నామాన్ని పవిత్రపరుస్తాం, ఐనా మనం జ్ఞానస్నానం పొందాక కూడ పాపంజేసి దేవునికి దూరమౌతాం. కనుక ఈ విన్నపంలో దేవుణ్ణి తప్పిదాలను మన్నించమని అడుగుకొంటున్నాం. ఈ వేడుదల ద్వారా ఓ సుంకరిలాగ, ఓ తప్పిపోయిన కుమారునిలాగ దేవుని దగ్గరికి మళ్ళా తిరిగివస్తాం. ఈ వాక్యం ద్వారా మన తప్పని ఒప్పకొంటున్నాం. దేవుని కరుణను విశ్వసిస్తున్నాం. దేవుని కుమారుని ద్వారా మనకు రక్షణమూ పాపపరిహారమూ లభించాయని నమ్ముతున్నాము. కొలో 1,14 దేవుని తిరుసభలో దేవద్రవ్యానుమానాల ద్వారా మనకు మన్నింపు లభిస్తుంది.
  కాని మనం ఇతరులను మన్నించకపోతే దేవుని కరుణ మన్నింపు మనకు లభించవు. కంటితో జూచిన నరుజ్జీ ప్రేమించకపోతే కంటితో చూడని దేవుణ్ణి ప్రేమించలేం గదా! - 1 యోహా 4,30, తోడి నరుని క్షమించనపుడు మన గుండెలు బండలా కఠినమౌతాయి. దేవుని కరుణ ఈ బండవారిన గుండెల్లోకి ప్రవేశింపలేదు, కాని మనం పశ్చాత్తాపపడినపుడు దేవుని వరప్రసాదం ఈ గుండెలు మెత్తబడేలా చేస్తుంది.
       తోడివారిని క్షమించాలనేది ప్రభువు బోధల్లో అతి ముఖ్యమైంది. ఈ బోధ పర్వత ప్రసంగంలోకి గూడ ప్రవేశించింది - మత్త 6, 14-15, ఇతరులను క్షమించే గుణం మనంతట మనకు సులువుగా అలవడదు. దేవుని వరప్రసాదం వలనా, అతని ఆత్మవలనా ఈ భాగ్యం లభిస్తుంది.
       ఈ క్షమాపణం మన హృదయంలోనుండి రావాలి, ఈలా రావాలంటే దేవుని పవిత్రతా, కరుణా, ప్రేమా మన హృదయాన్ని సోకి దాన్ని పునీతం చేసివుండాలి, ఆత్మ అనుగ్రహంవల్ల క్రీస్తు మనస్తత్వం మనకు కూడ అలవడివుండాలి - ఫిలి 2.5. అప్పడుగాని దేవుడు మనలను క్షమించినట్లే మనమూ ఒకరినొకరం క్షమించం - ఎఫే 4,32.