పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/83

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దత్తపుత్రులమనుకొంటాం. మనలను ఈలా పత్రులను చేసేది పరిశుద్దాత్మ. ఈ యాత్మ ప్రబోధం వల్లనే ఆ దేవుణ్ణి చనువుతో నాన్నా అని సంబోధించ గల్లుతున్నాం. మరో తాపులో పౌలు “మీరు కుమారులయ్యారు. కనుక అబ్బా - నాన్నా అని మొరపెట్టే తన కుమారుని ఆత్మను దేవుడు మీ హృదయాల్లోనికి పంపాడు" అని చెప్పాడు - గల 4,6. ఇక్కడ కుమారుని ఆత్మఅంటే క్రీస్తు పొందిన పరిశుద్ధాత్మ ఈ ఆత్మ మన హృదయాల్లో నెలకొని వుండి మనచేత దేవుణ్ణి నాన్నా అని పిలిపిస్తుంటుంది.

క్రీస్తు పరలోక పితకు ఏకైక కుమారుడు, సహజపుత్రుడు. ఆ క్రీస్తునందు మనంగూడ పరలోక పితకు పత్రులమౌతాం. క్రీస్తువలె మనం సహజ పుత్రులం గాముగాని, దత్తపుత్రులమౌతాం. దత్త పుత్రులమైనా మన పుత్రత్వం ఊహామాత్రమైందికాదు. యథార్థమైందే అందుకే “మనం దేవుని బిడ్డలమని పిలువబడుతున్నాం, యధార్థంగా బిడ్డలంగూడ" అంటుంది యోహాను తొలిజాబు - 3, 1. క్రీస్తులోనికి జ్ఞానస్నానం పొంది అతనిలోనికి ఐక్యం గావడంద్వారా ఈ దత్తపుత్రత్వం సిద్ధిస్తుంది. "యేసుక్రీస్తును విశ్వసించడం వలన మీరందరూ దేవుని కుమారులౌతున్నారు, క్రీస్తులోనికి జ్ఞానస్నానం పొందిన వాళ్లందరూ క్రీస్తును ధరిస్తున్నారు" అని చెప్పాడు పౌలు - గల 3, 26-27.

క్రీస్తునందు మనం దేవుని పుత్రుల మౌతామని చెప్పాం. కాని ఈలా క్రీస్తునందు మనం పుత్రులమయ్యేలా చేసేది పరిశుద్ధాత్మ ఆ యాత్మ ఓ దివ్యశక్తి ఈ శక్తి మనకు దైవపత్రత్వమిస్తుంది. ఆ యాత్మ మన హృదయంలో నెలకొనివుండి మనచేత దేవుణ్ణి అబ్బా, అనగా నాన్నా అని పిలిపిస్తుంది.

అబ్బా అనేమాట చాలా గొప్పపదం. ఈ శబ్దం ముగ్గురు దైవ వ్యక్తులనూ తలపిస్తుంటుంది. మనం క్రీస్తుకు సోదరులమౌతాం. ఆ క్రీస్తుఆత్మ మన హృదయంలో నివాస మేర్పరచుకొంటుంది. ఆక్రీస్తు తండ్రికి మనం బిడ్డల మౌతాం. ఈలా పరమత్రీత్వాన్నంతటినీ తలపనకు దెచ్చే శబ్దం, ఆత్రీత్వాన్నంతటినీ తనలో ఇముడ్చు కొనే శబ్దం అబ్బా, ఊ శబ్దాన్ని భక్తితో ఉచ్చరించడంద్వారా మనం త్రీత్వంతో సంబంధం కలిగించుకొంటాం. ఆ ముగ్గురు దైవ వ్యక్తులకు ప్రార్ధన చేసికొంటాం. ఆ వ్యక్తులను మన హృదయంలో నిలుపుకొంటాం.

హిందూ సాధకులు కొన్ని మంత్రాలను వాడుతుంటారు. ఈ మంత్రాల్లో బీజాక్షరాలు ఉండడం వల్ల అవి శక్తితో పనిచేస్తాయని నమ్ముతుంటారు. క్రైస్తవులమైన