పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/82

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఈలా ఉత్తానక్రీస్తు తన సాన్నిధ్యం ద్వారానే దేవునియెదుట మనతరపున విన్నపం చేస్తూంటాడు.

ఈ విజ్ఞాపన ఫలితంగా మనం పాపాలకు పశ్చాత్తాపపడి హృదయం శుద్ధి చేసికొంటూంటాం. దేవునితో ఐక్యమౌతూంటాం. తోడి ప్రజలను ప్రేమభావంతో ఆదరిస్తూంటాం. ఆ దేవుని కొరకూ సోదరప్రజల కొరకూ ఏవో సత్కార్యాలు చేస్తూంటాం. ఈ విధంగా మనం నిత్యం క్రీస్తు విజ్ఞాపన ఫలితాన్ని పొందుతూనే వుంటాం. ఐనా ఈ సత్యం మనలో చాలామందికి తెలియనే తెలియదు. అందుకే దేవదూతలనూ అర్యశిష్ణులనూ మన కొరకు ప్రార్థించమని వేడుకొంటూంటాంగాని, ఉత్దానక్రీస్తును మనకొరకు ప్రార్థించమని అడుగుకొనే అడుగుకోం. కాని బైబులు క్రైస్తవులు ఉత్దాన క్రీస్తు ప్రార్థనలను వినియోగించుకోవాలి. మన ప్రతిదిన జీవితంలో ప్రభు ప్రార్ధనా ఫలితాన్ని చవిజూస్తుండాలి.

రోమీయులు 8,26-27లో పరిశుద్ధాత్మడు మనకోసం విజ్ఞాపనం చేస్తుంటాడని చెప్పబడింది. ఆయాత్మడు మనహృదయంలోనేవుండి మనకొరకు విన్నపం చేస్తుంటాడు. మోక్షక్రీస్తమాత్రం మనకువెలుపల, తండ్రి సమక్షంలోవుండి, మనకొరకు విన్నపం చేస్తుంటాడు. ఈ యిద్దరు దైవవ్యక్తుల ప్రార్ధనా ఫలితంగా మనం ఒకపాటిగానైన దేవుణ్ణి విశ్వసించగల్లుతున్నాం. లేశమాత్రంగానైన క్రైస్తవ జీవితం గడపగల్లుతున్నాం. కనుక ఈ దైవవ్యక్తులను మనకొరకు ప్రార్థించమని అడుగుకొంటూండాలి. ఈ దైవవ్యక్తుల ప్రార్ధనల తర్వాతనే దేవదూతల ప్రార్ధనలూ పునీతుల ప్రార్థనలూను. ఇక్కడ ఒక సత్యంగుర్తించాలి. పునీతులకంటె దైవవ్యక్తులు ఎంత గొప్పవాల్లో, పునీతుల ప్రార్థనలకంటె ఆదైవ వ్యక్తుల ప్రార్ధనలూ అంత శ్రేష్టమైనవి. అనగా పునీతుల ప్రార్థనలు అవసరంలేదనిగాదు. దైవవ్యక్తుల ప్రార్థనలను మాత్రం అత్యవసరముగా వినియోగించు కోవాలనిభావం - అంతే.

4. క్రైస్తవుల ప్రార్ధనం

అబ్బా నాన్నా

క్రీస్తు తన తండ్రిని అబ్బా అని పిల్చేవాడు అనిచెప్పాం. ఆ క్రీస్తులాగే మనం కూడ పరలోకపితను అబ్బా అని పిల్వాలి అని బోధించాడు పౌలు. యూదుల్లాగ మనం దాస్యపు ఆత్మను పొందలేదు. దత్తపుత్రుల ఆత్మను పొందాం. ఆ యాత్మ సాయంతో దేవునికి - ఆబ్బా – నాన్నా అని మొరపెట్టు కొంటున్నాం - రోమా 8,15. అనగా పూర్వవేద ప్రజలు దేవునికి దాసుల మనుకొన్నారు, నూత్నవేద ప్రజలమైన మనం దేవునికి