పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/84

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మనం కూడ వాడుకోవలసిన ఓ మహా మంత్రం వుంది. అదే "అబ్బా" అనే పదం. ఈ పదంతో దేవుణ్ణి అనురాగంతోను చనువుతోను నాన్నా అని పిలుస్తాం. ఈలా పిలవమని బోధించాడు పౌలు తన క్రైస్తవ సమాజాలకు.

నరుడు దేవుణ్ణి నాన్నా అని సంబోధించగల్గడం మహాభాగ్యం. ఈ భాగ్యం క్రైస్తవ మతానికి ప్రత్యేకం. అన్యమతాల్లోని భక్తులకు భగవంతునిపట్ల ఇంత చనువూ సన్నిహితత్వమూ ఉన్నట్లు కన్పించదు. నరుడెక్కడ దేవుడెక్కడ? ఓ పేద నరుడు పరమేశ్వరుణ్ణి "నాన్నా" అని పిలవడం సామాన్యంగా లభించే భాగ్యమా! పరిశుద్ధాత్మ క్ర్తెస్తవ ప్రజలకు ఈ భాగ్యాన్ని ప్రసాదిస్తుంది.

క్రీస్తు ప్రార్థనలోని ఓ ముఖ్యాంశం భగవంతుణ్ణి చనువుతో నాన్నాఅని పిలవడమని ఈ వరకే చెప్పాం. క్ర్తెస్తవ ప్రార్థనలో గూడ ఈ లక్షణం వుండాలి. ఆ భగవంతుణ్ణి తండ్రిలాంటివాణ్ణిగా భావనకు తెచ్చుకోవాలి. అనుభవానికీ తెచ్చుకోవాలి. ఈ యనుభవం కుదరకపోతే కేవలం పెదవులతో ప్రార్ధనం చేసినవాళ్లమౌతాం. రామచిలుకల్లాగ అర్ధమూ పర్ధమూ లేని వాక్యాలను వల్లించుకొంటూ పోయినవాళ్లమౌతాం. అప్పుడు "ఈ ప్రజలు నన్ను పెదవులతో గౌరవిస్తున్నారుగాని వీళ్ల హృదయం నాకు చాలా దూరంగావుంది" అన్నప్రవక్తవాక్యం మనకూ అక్షరాల వర్తిస్తుంది - యొష 29, 13.

5. ప్రార్థనమూ - వ్యక్తిగతానుభావమూ

1. బైబులు భక్తుల అనుభవం

ప్రార్థనలో వ్యక్తిగతానుభవం చాలా. ఈ యనుభవంలేని ప్రార్ధన రుచిలేని భోజనం లాంటిది. బైబులు భక్తుల్లో ఈ యనుభవం గాఢంగా వుండేది. మచ్చునకు కొన్ని ఉదాహరణలు చూద్దాం. మొదట పౌలు వాక్యాలను కొన్నిటిని పరిశీలిద్దాం. అతడు ఇప్పడు నేనుగాదు నాయందు క్రీస్తే జీవిస్తున్నాడా అని చెప్పకున్నాడు - గల 2, 20. నాకు జీవించడమంటే క్రీస్తుని జీవించడమే అని వ్రాసికొన్నాడు - ఫిలి 1,21. తన జీవితాంతంలోగూడ పాలు పాపుల్లో నేను ప్రధానుణ్ణి అని చెప్పకున్నాడు - 1తిమో 1,15. క్రీస్తుతో పోల్చుకొంటే ఈ లోకంలోని విలువలన్నీ పెంటప్రోవుతో సమానం అని భావించాడు - ఫిలి 3,8. ఆ ప్రభువు పట్ల అతనికి కలిగిన భక్తిపారవశ్యం ఆలాంటిది.