పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/76

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఈ తండ్రిని "పరలోకంలోవుండే మా తండ్రీ అని సంబోధిస్తున్నాం, దేవుణ్ణి పరలోకంలో వుండే దేవుడని పేర్కొనడం యూద ప్రజల సంప్రదాయం, అతడు అంతటా వుంటాడు, విశేషంగా నరుల హృదయాల్లో నెలకొని వుంటాడు. ఐనా యూదులు గౌరవార్థం అతడు పరలోకంలో వుంటాడనీ, మోక్షంలో వుంటాడనీ చెపూంటారు.

2) దేవుని నామం

మొదటి విన్నపంలో దేవుని నామం పూజింప బడాలి అని ప్రార్ధిస్తున్నాం. బైబుల్లో నామమంటే వ్యక్తి కనుక ఇక్కడ తండ్రీ! నీవు పూజింపబడాలి అని అర్థం. బైబులు భగవంతుడు మహా పవిత్రుడు. అతడు తన పావిత్ర్యాన్ని కనపరుస్తాడు. దేవుడు యిప్రాయేలీయుల నడుమ తన్ను పవిత్ర పరచుకొన్నాడు అంటుంది సంఖ్యాకాండం 20, 13. ఈలా దేవుడు తన పావిత్ర్యాన్ని వెల్లడిచేయగా, నరుడు ఆ పావిత్ర్యాన్ని అంగీకరిస్తాడు. ఆ ప్రభుని పూజిస్తాడు. అతని నామాన్నిస్తుతిస్తాడు.

కాని నరుడు దేవుని సామాన్ని ఏలా పూజిస్తాడు? ఆతని పావిత్ర్యాన్ని స్తుతించడంవల్ల, అతనిని ఆరాధించి పూజించడం వల్ల, అతని ఆజ్ఞలను పాటించడం వల్ల, తాను అతని చిత్తానికి బదుడు కావడంవల్ల ఇక, ఈ దేవుళ్లీ అతని నామాన్ని పూజించే శక్తిని మనకు ప్రసాదించేది పవిత్రాత్మ ఆ యాత్మ ద్వారానే మనం దేవుణ్ణి ఆరాధించగల్లుతున్నాం.

3) దేవుని రాజ్యం

రెండవ విన్నపంలో దైవరాజ్యం కొరకు ప్రార్థిస్తాం, ఇక్కడ రాజ్యమంటే పరిపాలనం. కనుక దేవుడు నరులను పరిపాలించాలని ఈ విన్నపం భావం. ఇక, దేవుడు తన ప్రతినిధియైన మెస్పీయాద్వారా నరులను పరిపాలిస్తాడు. ఈ మెస్సీయా క్రీస్తు క్రీస్తుతోనే దైవరాజ్యం ప్రారంభమౌతుంది. ఆ రాజ్యాన్ని స్థాపించేవాడుగూడ క్రీస్తే, క్రీస్తు నెలకొల్పే ఈ దైవరాజ్యం వ్యాప్తిచెందాలి. దానికి నరుని సహకారం అవసరం, కనుక ఈ విన్నపంలో క్రీస్తు నెలకొల్పే దైవరాజ్యం మన తోడ్పాటుతో పెంపజెందాలని ప్రార్ధిస్తున్నాం.

కాని ఈ దైవరాజ్యం ఎక్కడ పెంపజెందుతుంది? నరుల హృదయాల్లోనే నరుడు నిండు హృదయంతో పరలోక పితనూ అతడు పంపిన క్రీస్తునూ అంగీకరించాలి. తన హృదయంలో ఆ దేవుణ్ణి ఆరాధించాలి. ఈ హృదయారాధనమే దైవరాజ్యం. మనం తరచుగా దైవరాజ్యాన్ని నెలకొల్పడమంటే బళూ గుళూ ఆసత్రులూ నిర్మించడ మనుకొంటాం. ఈ సంస్థలకు పెద్దపెద్ద భవనాలను నిర్మించడమనుకొంటాం. అందుకే మన శక్తినీ డబ్బునీ