పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/75

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పిలిపించాను" అంటాడు. యెషయా ప్రవచనం 63,16లో ప్రజలు ప్రభువు నుద్దేశించి "నీవే మాకు తండ్రివి. అబ్రాహము మమ్మంగీకరించక పోవచ్చుగాక, యాకోబు మమ్మాద రించక పోవచ్చుగాక. ఐనా యావే ప్రభూ! నీవే మా తండ్రివి, అనాది కాలంనుంచీ మా విమోచకుడవని నీకే పేరుగదా!" అంటారు. ఈ యూదాహరణ లన్నిటిలోను దేవుడు తండ్రి అనే భావం. కాని ఇక్కడ ఒక్క విశేషముంది. ఈ యదాహరణల్లో దేవుడు ప్రజలకు సాముదాయికంగా తండ్రిగాని వ్యక్తిగతంగా గాదు. పూర్వవేదమెక్కడా దేవుణ్ణి వ్యక్తిగతంగా తండ్రి అని పేర్కొనదు.

ఈ లాంటి పరిస్థితుల్లో భగవంతుణ్ణి మొట్టమొదటిసారిగా వ్యక్తిగతంగా తండ్రిఅని పేర్కొన్నవాడు క్రీస్తు ఆ దేవుడ్డి తండ్రి అని పిలవడానికి అతడు వాడిన అరమాయిక్ పదం "అబ్బ". ఈ శబ్దానికి “నాన్న" అని అర్థం - మార్కు - 14,36.

క్రీస్తుకాలంలో యూదుల చిన్నబిడ్డలు ఇంటిలో వాళ్ల సాంత తండ్రిని "అబ్బ" అని సంబోధించేవాళ్ళు ఈ పదంలో ఎంతో పరిచయమూ చనువూ ప్రేమభావమూ ఇమిడివుండేది. ఈలాంటి శబ్దాన్నియూదులు పరలోకంలోని దేవనికి వాడ్డానికి జంకేవాళ్ళ అసలు ఆ దేవుడంటేనే వాళ్ళకి విపరీతమైన మర్యాదా భయమూను. అందుకే వాళ్ళ అతని పేరు కూడ ఉచ్చరించే వాళ్ళ గాదు. హీబ్రూ బైబుల్లో యావే అనే పేరు వచ్చినపుడెల్లా దేవుని పట్లగల గౌరవంచేత ఆ పేరును ఉచ్చరించకుండ "అడోనాయి" అనే మరో అరమాయిక్ మాటను ఉచ్చరించేవాళ్ళ ఈ శబ్దానికి ప్రభువు లేక యజమానుడు అని భావం. మన దేశంలో ఈ కాలపు ఆడవాళ్ళ గాదుగాని, వెనుకటితరం ఆడవాళ్ళు భర్త పేరు ఉచ్చరించేవాళ్ళు కాదు. అదొక సంప్రదాయమూ గౌరవమూను. ఈలాగే యూద ప్రజలుగూడ భగవంతునిపేరు ఉచ్చరించేవాళ్ళగాదు. అతని పేరు వచ్చినపుడెల్ల యజమానుడనీ ప్రభువనీ చెప్పకొంటూండేవాళ్లు ఈలాంటి పరిస్థితుల్లో వాళ్లు దేవుణ్ణి "అబ్బా" అని పిలవడం దేవదూషణంగా భావించేవాళ్లే.

ఐనా క్రీస్తు ఆ దేవుణ్ణి తొలిసారిగా "అబ్బా" అని సంబోధించాడు అని చెప్పాం. ఆ దేవునిపట్ల అతనికుండే పరిచయమూ చనువూ ఆలాంటిది. అతడు దేవునికి ఏకైక కుమారుడు, ఆ తండ్రి తప్ప మరెవ్వరు కుమారునెరుగరు. కుమారుడు తప్ప మరెవ్వరు ఆ తండ్రి నెరుగరు. ఆ కుమారుడు తండ్రిని మనకు తెలియజేయబట్టే మనంకూడ అతన్ని పరలోకంలోని మా తండ్రీ అని పిలువగల్లుతున్నాం - మత్త 11,27. క్రీస్తులోనికి జ్ఞానస్నానం పొంది, అతనిలోనికి ఐక్యమై, మనంకూడ అతని తండ్రిని నాన్నా అని సంబోధించ గల్లుతున్నాం - రోమా 8, 15, నరుడు దేవుణ్ణి నాన్న అని పిలువడం సామాన్యమైన భాగ్యంకాదు.