పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/67

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

4.క్రీస్తుప్రార్ధనం


                                                     బైబులు భాష్యం - 22

                             

విషయసూచిక

1. క్రీస్తు ప్రార్ధనం
2. పరలోక జపం
3. క్రీస్తు విజ్ఞాపనం
4. క్రైస్తవుల ప్రార్ధనం ప్రార్ధనమూ - వ్యక్తిగతానుభవమూ

1. క్రీస్తు ప్రార్ధనం


1. యూదుల ప్రార్థనా పద్ధతులు


క్రీస్తు ప్రార్థనాభ్యాసాన్ని అర్థంచేసికోవాలంటే పూర్వవేదపు యూదుల ప్రార్థనా పద్ధతులను తెలిసికొని వండాలి. పూర్వవేదకాలంలో యూదుల ప్రార్ధన షేమ, టఫిల్ల, భోజనప్రార్ధనం అని మూడురకాలుగా వుండేది.

1. షేమ ద్వితీయోపదేశ కాండంలోని 6, 4–9 వచనాలు. ధర్మశాస్తోపదేశకుడు ఆజ్ఞలన్నింటిలోను ప్రధానమైనదేదని ప్రశ్నించినపుడు క్రిస్తు పైవాక్యాలనే ఉదహరించాడు: "యిస్రాయేలూ విను! మన దేవుడైన ప్రభువు ఏకైక దేవుడు. నీ దేవుడైన ప్రభువును పూర్ణహృదయంతోను, పూర్ణాత్మతోను, పూర్ణశక్తితోను ప్రేమించాలి" — మార్కు 12, 30. యూదులు ఈ ద్వితీయోపదేశ గ్రంథ వాక్యాలను రోజూ రెండుసార్లు వల్లించేవాళ్ళ ఉదయం నిద్రలేచినపుడూ, సాయంకాలం నిద్రబోవకముందూను. 12 యేండ్లకు పైబడిన మగవాళ్ళంతా ఈ ప్రార్ధన చెప్పేవాళ్ళ స్త్రీలు, పిల్లలు, బానిసలు ఈ జపం చెప్పనక్కరలేదు. హీబ్రూభాషలో "షేమ" అంటే వినడం అని అర్థం. ఈ ప్రార్థనారంభంలో "యిప్రాయేలూ విను!" అనే మాట వస్తుంది గనుక దీనికి షేమ అని పేరు వచ్చింది. ఈ పేమలో యూదులు మత సత్యాలన్నీ సంగ్రహంగా యిమిడివున్నాయి. కనుక ఇది వాళ్లకు ఓ చిన్న విశ్వాససంగ్రహం లాంటిది. తొలినాటి క్రైస్తవసమాజంలో యూద మతంనుండి క్రైస్తవంలో చేరిన యూదులంతా ఈ ప్రార్ధనచేసేవాళ్ళ
59