పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/68

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

2. టఫిల్ల అనగా స్తుతి. పూర్వ వేదగ్రంథాలనుండి ఎత్తి తీసిన 18 స్తుతి వాక్యాలతో యూదులు ప్రభుని స్తుతించేవాళ్ళ ఉదయమూ, మధ్యాహ్నము කා-ඩීරයීසී, రాత్రిపూట - రోజుకి మూడుసార్లు ఇలా ప్రభుని స్తుతించేవాళ్ళ ఈ ప్రార్ధనలో మగవాళ్ళ ఆడవాళ్ళ పిల్లలూ బానిసలూ అంతా పాల్గొనేవాళ్ళ అపోస్తలుల కార్యాలు 3,1 తొలినాటి యూదక్రైస్తవులు మధ్యాహ్నం మూడింటికి దేవాలయానికి ప్రార్థనకు వెళ్లారని చెప్తుంది. ఇది టఫిల్లా ప్రార్థనే, ప్రవక్త దానియేలు రోజు ఈ ప్రార్థన చేసేవాడని దానియేలు గ్రంథము 6, 10 వాకొంటుంది.

3. ఇక భోజనప్రార్ధనం భోజనానికి ముందూ వెనుకా ప్రభుని స్తుతించి చెప్పే ప్రార్ధనం. యూద ప్రజలు మామూలుగా కుటుంబమంతా కలసే భోజనం చేసేవాళ్ళ ఆ భోజనానికి ముందు వెనుకా కుటుంబయాజమానుడైన తండ్రి ఈ ప్రార్ధనం చేసేవాడు.
పూర్వవేద ప్రజలు రోజురోజు తప్పనిసరిగా చేయవలసిన ప్రార్థనలు ఈ మూడే తతిమ్మాప్రార్థనలను ఎవరెవరి అక్కర కొలదీ భక్తి కొలదీ వాళ్ళ చేసికొంటూ వుండేవాళ్ళు.

2. క్రీస్తు ప్రార్ధనం


ఈ లాంటి వాతావరణంలో పుట్టిపెరిగినవాడు క్రీస్తు. కనుక అతడు తన పూర్వుల ప్రార్థనా పద్ధతులలో చక్కగా తర్ఫీదు పొందినవాడే. ఐనా యూదుల ప్రార్థనతో పోల్చి చూస్తే క్రీస్తు ప్రార్థనలో కొన్ని ప్రత్యేకాంశాలు గోచరిస్తాయి.
 1. ప్రభువు రాత్రుల్లో ఏకాంతంగా నిర్ణన ప్రదేశాల్లో ప్రార్ధనం చేసికొనేవాడు. విశేషంగా విజన ప్రదేశాలైన కొండలూ అరణ్యాలూ అతని ప్రార్థనా స్థలాలు. అతడు వేకువజాముననే లేచి ఓ నిర్ణన ప్రదేశానికి వెళ్ళి ప్రార్థన చేసికోవడం మొదలెట్టాడు అంటుంది మార్కు సువార్త 1.35. ప్రార్ధనచేయడానికి యేసు కొండసీమకు వెళ్ళాడు అంటుంది అదేగ్రంథం 6,46, యేసు ఏకాంతంగా ప్రార్థన చేసికోవడానికి అరణ్యానికి వెళ్ళాడు అంటుంది లూకా సువిశేషం 5, 16. ప్రభువు కొండకువెళ్ళి రాత్రంతా ప్రార్థనలో గడిపాడు అని చెపుతుంది అదే పుస్తకం 6,12. ప్రభువు ఒంటరిగా ప్రార్థన చేసికొంటుండగా ఆయన శిష్యులు గూడ అచటికి చేరుకొన్నారు అంటుంది అదే గ్రంథం 9,18. పూర్వవేదపు యూదులు ఈలా వాడుక ప్రకారంగా ఏకాంత ప్రార్ధన చేసినట్లుగా వినం. పైపెచ్చు ఆనాటి యూదులు డంబంతో వీధుల్లో నిలబడి పదిమంది చూచేలాగా టఫిల్లా మొదలైన ప్రార్ధనలు చేస్తుండేవాళ్ళ ప్రభువు ఈ బాహ్యాడంబరాన్ని నిరసించాడు. అదృశ్యుడైయున్న దేవుని సన్నిధిలో ఏకాంతంగా ప్రార్థన చేసికోవాలని బోధించాడు. మన ప్రార్థనలకు బహుమానమిచ్చేది అదృశ్యుడైయున్న ఆ ప్రభువేగాని తోడినరులు కాదని హెచ్చరించాడు - మత్త 6,5-6. 60