పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/66

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

48. వినయం


వినయమూ నమ్రాతకల యేసూ! నన్నుగూడ నీలాంటివాణ్ణిగా చేయి
ఇతరులు నన్ను గౌరవించి పొగడాలనే కోర్కెనుండి నీవు నన్ను కాపాడు
ఇతరులు నన్ను సలహా అడగాలనే కోర్మెనుండి నీవు నన్ను కాపాడు
ఇతరులు నన్ను చిన్నచూపు చూస్తారనే భయంనుండి నీవు నన్ను కాపాడు
ఇతరులు నా మీద నిందలు మోపుతారేమో,
నన్ను ఎగతాళి చేస్తారేమో అనే భయంనుండి నీవు నన్ను కాపాడు
ఇతరులు నన్ను మర్చిపోతారేమో అనే భయం నుండి నీవు నన్ను కాపాడు
ఇతరులు నాకు అపకారం చేస్తారేమో,
నన్ను శంకిస్తారేమో అనే భయం నుండి నీవు నన్ను కాపాడు
ఇతరులు నా కంటె ఎక్కువ ప్రేమను పొందాలని
కోరుకొనే వరప్రసాదాన్ని నీవు నాకు దయచేయి
ఇతరులు నాకంటె ఎక్కువ గౌరవాన్నీ ప్రసిద్ధినీ పొందాలని
కోరg వరప్రసాదాన్ని నీవు నాకు దయచేయి
లోకం ఇతరులను ఎన్నుకొని నన్ను తృణీకరించాలనీ,
ఇతరులను కీర్తించి నను విస్మరించాలనీ
gరజ్రా వరప్రసాన్ని నీవు నాకు దయచేయి
 లోకం ఇతరులను నా కంటె యోగ్యులనుగా గణించాలని
కొరుకొనా వరప్రసాదాన్ని నీవు నాకు దయచేయి.
58