పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/280

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

62. డాంబిక వర్తనం

మత్త 23

ప్రభూ! నీది స్ఫటికంలాంటి మనస్సు
కనుకనే డాంబికవర్తనమంటే నీకు గిట్టదు
ఒకటి బోధిస్తూ మరొకటి ఆచరించే
ఆనాటి పరిసయులనూ వాళ్ళ కపటవర్తనాన్నీ
నీవు పిడుగుల్లాంటి శాపవచనాలతో ఖండించావు
ఆ డాంబికులకు సద్దతులు లేవని ఖండితంగా జెప్పావు
వాళ్ల దైవరాజ్యమనే గృహంలో తాము ప్రవేశింపనూలేదు
ఇతరులను ప్రవేశింపనీయనూ లేదు
నరులు చేసిన నియమాలనూ గొప్పగా గణిస్తూ
దేవుని నియమాలైన కారుణ్యాన్ని సాంఘిక న్యాయాన్ని
పూర్తిగా విస్మరించి పాషాణహృదయులయ్యారు
దోమల్లాంటి చిన్న ప్రాణులను వడకట్టి
ఒంటెల్లాంటి పెద్దప్రాణులను గుటుక్కున ప్రమింగారు
గ్రుడ్డినాయకులై మార్గం దెలియలేక
తమ్మనుసరించే జనంతోపాటు తామూ గోతిలో గూలారు
యితరులవిూద యెంతటి భారాలనైనా మోపడానికి ఏమాత్రం
వెనుదీయలేదుగాని ఆ బరువులనెత్తడానికి మాత్రం
తమ చిటికెనవేలినైనా చాపలేదు
సున్నంగొట్టిన సమాధుల్లా బయటికి తళతళలాడుతూ
లోలోపల క్రుళ్ళిన దుర్గంధంతో కంపగొట్టారు
ఇది నీవు చిత్రించిన పరిసయుల డాంబికవర్తనం
కాని ప్రభూ! నాజీవితంమాత్రం సరళంగావుందా?
నా తలపులకీ మాటలకీ చేతలకీ పొందికేలేదు
కనుకనే నేను ఒకటి తలుస్తాను, మరొకటి చెప్తాను,
ఇంకొకటి చేస్తాను - వంచకబుద్ధితో
బయటికి మాత్రం వేషాలువేసి కొండంత నటన చేస్తాను
ఈలాంటి డాంబికుణ్ణి నీవు మెచ్చుకొంటావా?
ఛిత్తశుద్ధిలేని నా జీవితాన్ని నీవు చీదరించుకోవా?
కనుక ప్రభూ! నీతులు చెప్పేవారికి