పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/281

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బూతులు మెండు అన్నట్లుగా కాకుండ
నేను ఆర్భాటంతో బోధించే ఆ నీతిసూత్రాలను
నా జీవితంలోకూడ పాటించే మహాప్రసాదాన్ని
డంబాచారినైన నీ యీ దాసునికి తప్పక దయచేయి

63. ప్రభువు తేజస్సు

నిర్గ 34, 29-30. 2కొ 3, 18

ప్రభూ! మహాభక్తుడైన మోషే
సీనాయి కొండమిూద కెక్కగా
యావే తేజస్సు సోకి అతని ముఖం ప్రకాశించింది
కాని నూత్నవేద ప్రజలమైన మేము
ఉత్థానమూర్తివైన నీ తేజస్సు సోకి ప్రకాశిస్తాం
నీలోనికి మారి నీ రూపం గైకొంటాం
మా చేతల్లో మాటల్లో నిన్ను ప్రతిబింబించుకొంటాం
మేము నీకు సాక్షులంగా వుండకపోతే
మా యికా క్రైస్తవ జీవితానికి అర్థమేలేదు
లోకంలో జనం మాయందు నిన్ను గుర్తించకపోతే
ఇక మేమేపాటి శిష్యులం?
కనుక ప్రభూ! నీవు మా ద్వారా ప్రకాశించు
మా ద్వారా లోకానికి నీ వెలుగును ప్రసరించు
ఆ వెలుగు నీదే కాని మాదికాదు
ఐనా అది మా గుండా ప్రసరిస్తుంది
మమ్మ నీకు సాక్షులను చేస్తుంది
ఆ మోషేలాగ నీ తేజస్సును
మా నడవడికలో ప్రతిబింబించు కోవడంకన్న
మేము చేయగలిగిన మహత్తర కార్యం మరేముంటుంది?

64. ఉత్సాహం కలిగించే ప్రభువు

యెహెజ్కేలు 37, 1-14

.

బాబిలోను ప్రవాసంలో రోజులు సాగించే ప్రవక్త యెహెజ్కేలు
ఓమారు దర్శనంలో ఓ లోయను చూచాడు
దానినిండా యెండిన యెముకలు ప్రోగుపడి వున్నాయి
పూర్వమక్కడ యుద్ధం చేసి నిహతులైన సైనికుల బొమికలవి