పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/279

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కాబోయే నీ యనుచరులందరిమిూదా
అతనికి ఆధిపత్యం దయచేసావు
మూడుసార్లు నిన్నెరుగనన్నందుకు ప్రాయశ్చిత్తంగానేమో
మూడుసార్లు ప్రేమిస్తున్నానని ప్రమాణంచేసాడు పేత్రు
ఈ సంఘటనం నుండి మేము నేర్చుకొనవలసిన పారాలు
చాలా వున్నాయి కదా!
యూదా పేత్రు యిద్దరూ పాపం కట్టుకొన్నారు
ఐనా యూదా అపనమ్మకంతో ఉరివేసికొన్నాడు
అతడు తన్ను క్షమింపమని నిన్నడుగనూ లేదు
నీ నుండి మన్నింపు పొందనూ లేదు
పేత్రు మాత్రం నమ్మకంతో నిన్ను శరణువేడాడు
నీనుండి మన్నింపు పొంది నీ యభిమానాన్ని చూరగొన్నాడు
నీవు క్షమింపలేనంత ఘనోరమైన పాపాలు
మేమేమి చేయలేంగనుక
ఎంత పెద్ద తప్ప చేసినా మేము నిరాశపడకూడదు
ఇంకా, నీవు పేత్రులాంటి దుర్బలుడ్డి నమ్మి
అతన్ని నీ సమాజానికి అధిపతిని చేసావు
ఈ సత్యాన్ని అర్థంచేసికోలేక
మేము శ్రీసభలోని అధికారులను విమర్శిస్తూంటాం
వాళ్ళ బలహీనతలకూ అవకతవకలకూ విస్తూపోతాం
ఐనా వాళ్ళద్వారా శ్రీసభను నడిపించేది నీవు కాదా?
పైపెచ్చు నీకు ద్రోహం చేసిన పేత్రుని
నీవు నమ్మకమైన వాణ్ణిగా యెంచావు
ఇతరులను కాదని అతనికి నాయకత్వం అప్పజెప్పావు
అలాగే ఎన్నోసారులు నీ మనసు నొప్పించిన
మాకు కూడ నీ సమాజంలో
ఓ బాధ్యతా ఓ పదవీ అప్పజెప్పావు
నీ ప్రజలకు సేవలు చేసే భాగ్యం దయచేసావు
ఈలా పాపకర్మలమైన మమ్మ విశ్వసనీయులనుగా భావించి
మామిదా మాకే నమ్మకమూ గౌరవమూ
కలిగేలా చేసావు గనుక
మేము నీకు ఏప్రొద్దూ వందనశతా లర్చిస్తూంటాం.