పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/253

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పరిశుద్ధమూర్తికి హృదయాన్నర్పించుకొంటేనేగాని
అతడు పాపమాలిన్యాన్నుండి మమ్మ శుద్ధి చేయడు
కనుక తండ్రీ! నిన్నూ నీవు పంపగావచ్చి సిల్వనెక్కిన క్రీస్తనీ
మేము గాఢంగా విశ్వసించే భాగ్యాన్ని దయచేయి
ఈ విశ్వాసంద్వారానే బ్రతికిపోయే వరాన్ని గూడ ప్రసాదించు.

37. సానుభూతికల యాజకుడు

హెబ్రే 2,14-18, 4,14-16, 7,25

ప్రభూ! మా ప్రధానయాజకుడవైన నీ వేలాంటివాడివి?
నీవు దేవదూతల కుటుంబంలోకాక
ఆదాము సంతతిలో అవతరించావు
ఎందుకు? మా బలహీనతలనూ బాధలనూ
అనుభవపూర్వకంగా తెలిసికోవాలనే నీ కోరిక
మానవుడవైనందున మా శ్రమలకూ మరణానికీ నీవూ గురయ్యావు
కాని ఆ మరణాన్ని జయించి మాకు అమరత్వం దయచేసావు
అలాగే మా శోధనలకుగూడ నీవు తలొగ్గావు
కాని శోధలన్నిటిని జయించి
పిశాచంమిూద మాకు విజయం ప్రసాదించావు
ఈలా సమస్త విషయాల్లోను నీవు
నీ సోదరులమైన మాలాంటివాడి వయ్యావు
ఒక్క పాపంలో దప్పితే నీకూ మాకూ వ్యత్యాసం లేదు
మా ప్రధానయాజకుడవైన నీవు
బలహీనులమైన నీ యూ తోబట్టవులపట్ల
సానుభూతి చూపలేనివాడివి కాదు
మా యవకతవకలను జూచి మమ్మసహ్యించుకొనేవాడివీ కాదు
పైపెచ్చు మేమెంత దుర్భలులమో
అంతగా మమ్మ కరుణించేవాడివి,
అంతగా మమ్మాదుకొని పైకి లేవనెత్తేవాడివి
ఎందుకంటే నీవు మా జన్మనెత్తి మా దౌర్భాగ్యాలకు గురై
మాపట్ల జాలి చూపడం నేర్చుకొన్నావు
ఇంకా నీవు మమ్మెప్పడూ చీదరించుకోవు
కనుక నీవు తండ్రి సమక్షంలో పండి
మాకోసం నిరంతరమూ విజ్ఞాపనం చేస్తూంటావు