పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/252

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తరతరాలబట్టి నరులంతా ప్రమాదపడుతున్నారనుకొంటాను
కాని నిన్నునాబుద్ధి శక్తితోనే అర్థం చేసికోగలనా?
విశ్వాసంద్వారా కాదా? ప్రవక్త నుడివినట్లు
విశ్వాసంతో జీవించేవాళ్లు కాదా పుణ్యపురుషులు?
కనుక ప్రభూ! నీ మహిమ అల్పమైన నా బుద్ధి కందదనీ
నిన్ను నమ్మడంలో మౌఢ్యం ఏమిలేదనీ
నేను గుర్తించేలా చేయి.

36. గడెమీది పాము

సంఖ్యా 21,4-9. యోహా 8,14-15. మత్త 1,21

ప్రభూ! యిస్రాయేలీయులు ఎడారిలో ప్రయాణంచేస్తూ
అక్కడి కూడు గిట్టక మోషేమిూద తిరగబడ్డారు
దానికి శిక్షగా విషసర్పాలు వచ్చి వాళ్ళను కరచాయి
అప్పడు మోషే నీ యాజ్ఞపై కంచుపాముని చేసి
గడెమిూద వ్రేలాడగట్టి ప్రజలకు చూపించాడు
సర్పదష్టులు నీమాటను నమ్మి ఆపామువైపు చూడగా
విషం విరిగి బ్రతికిపోయారు
ఆనాడు కంచుపాము వాళ్ళను బ్రతికించలేదు
నీమాటను నమ్మినవాళ్ళను పాముద్వారా నీవు బ్రతికించావు
ఇక క్రీస్తుని కూడ ఆ పామునిలాగే సిల్వవిూది కెత్తారు
పూర్వవేద ప్రజలు ఆ పామువైపు చూచి బ్రతికిపోయినట్లే
నూత్నవేద ప్రజలమైన మేముకూడ ఆ క్రీస్తువైపు చూచి -
అనగా సిల్వమిూద వేలాడే క్రీస్తుని విశ్వసించి - బ్రతికిపోతాం
తన్ను విశ్వసించినవాళ్ళకు క్రీస్తు నిత్యరక్షణం దయచేస్తాడు
అతనిపేరు యేసు, ఆ పేరుకి రక్షకుడనే అర్థం
పాపవిషాన్నుండి నరులను రక్షించే ప్రభువతడు
అతని సిలువకూడ ఓ జెండాలాగ అందరినీ ఆకర్షిస్తుంది
కాని అతడు తనంతట తాను రక్షకుడైనా
మామట్టుకు మాకు రక్షకుడు కావచ్చు కాకపోవచ్చు గూడ
చెట్టుమిూదిపండు కోసికొంటేనేగాని మాదికాదు,
అంగటిలోని మిఠాయి కొనుక్కొంటేనేగాని మాదికాదు
అలాగే మా తరపున మేము క్రీస్తును విశ్వసిస్తేనే గాని
ఆ ప్రభువు మాకు రక్షకుడు కాడు