పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/251

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఓ సుందరమైన దేవళంగా తయారౌతాయి
నీవు పునాది రాయివైతే మేము దానివిూద చేరిన రాళ్ళం
దేవళంలోని రాళ్ళన్నీ మూలరాతిమిూద ఆధారపడినట్లే
మేమందరమూ నీ మిూద ఆధారపడి జీవిస్తాం
నీవూ మేమూ అందరమూ కలసి ఓ మందిర మౌతాం
ఆ మందిరంలో తండ్రికి ఆరాధన చెల్లిస్తాం
నీవూ మేమూ కలసి యేర్పడిన క్రైస్తవసమాజమే
ఈ సుందర మందిరం.

35. చూడకుండానే విశ్వసించేవాళ్ళు

యోహా 20,24-29. హబుక్కూకు 2,4

భగవంతుణ్ణి శంకించేవాళ్ళ ఎప్పడూ వుండనే వుంటారు
అలాంటివాళ్ళల్లో శిష్యుడు తోమాకూడ వొకడు
"నేను క్రీస్తు హస్తాల్లోని చీలగంట్లల్లో వ్రేళ్ళ జొన్పితేనేగాని
అతని ప్రక్కగాయంలో చేయిపెట్టి చూస్తేనేగాని
ఆ ప్రభువు ఉత్తానాన్ని నమ్మను"
అని అతడు శిష్యులతో వాదించాడు
ఎన్మిదిరోజులు గడిచాక, తోడి శిష్యులూ తోమా అందరూ
తలుపు మూసికొని గదిలో ప్రార్థన చేసికొంటూండగా
ప్రభూ! మూసిన ద్వారంగుండానే నీవా గదిలో ప్రవేశించావు
తోమాతో "బాబూ! నాచేతి గంట్లల్లో నీ వ్రేళ్ళ జొన్పించు
నా ప్రక్క గాయంలో నీ చేయి పెట్టిచూడు
ఇకనైనా ఈ యవిశ్వాసాన్ని వదలుకో" అన్నావు
ఆ శిష్యుడు భక్తిభావంతో "స్వామి! నీవే నా ప్రభువువి
నీవే నా దేవుడవు" అంటూ నీ ముందట చాగిలపడ్డాడు
నీవతనితో "ఓయి! నీవు నన్ను చూచావు కనుక నమ్మావ
కాని చూడకుండా నమ్మేవాళ్ళ మరీధన్యులు" అని నుడివావు
ప్రభూ! నేనుకూడ కొన్నిసార్లు ఈ తోమాలాగే ప్రవర్తిస్తాను
వేదసత్యాలను శంకిసాను, దివ్యగ్రంథాన్ని సందేహిస్తాను,
పునీతుల చరిత్రలనూ భక్తుల అద్భుతాలనూ అనుమానిస్తాను,
ఎవరైనా నీవు తమకు సాక్షాత్కరించావని
అవన్నీ కల్లబొల్లి కబుర్లేమో ననుకొంటాను,
మతాచరణమూ భక్తి ఓ విధమైన బ్రమయేమో ననుకొంటాను