పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/254

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆ ప్రార్ధనా ఫలితంగా మేము పడిపోయికూడ మళ్ళా లేస్తాం
ఈలాంటి యాజకుడవైన నిన్ను ముందుబెట్టుకొనే
మా బాధల్లో మే మా తండ్రిని సమిూపిస్తాం
కృపాసింహాసనంమిద ఆసీనుడైయున్న ఆ దయానిధి
నిన్నుజూచి మమ్ము నెనరుతో ఆదరిస్తాడు
సమయోచితమైన వరప్రసాదంతో మమ్మాదు కొంటాడు
యాజకుడవూ యజ్ఞపశువివీ ఐన ప్రభూ!
నీతో ఐక్యమై తండ్రిని అర్చించే భాగ్యం మాకు దయచేయి.

38. అహాన్ని జయిస్తేనేగాని

యోహా 12,24-25.15, 2.16,21, మత్త 16,24-25

ప్రభూ! నరుడు తన్నుతాను పరిత్యజించుకోండే ఫలితం లేదు
మాలోని స్వార్థం చావండే మేమేమియా సాధించలేం
ఈ సత్యాన్ని బోధించడానికి నీ వెన్నో ఉపమానాలు చెప్పావు

గోదుమగింజ భూమిలో పడనంతవరకు ఒంటిగానే వుంటుంది
కాని ఓమారు నేలలోపడి చివికిపోతే
మొలకెత్తి దుబ్బువేసి సమృద్ధిగా ఫలిస్తుంది

ద్రాక్షతీగకు కత్తిరింపవేస్తే అది యేపుగా యెదిగి
తీయని కాయలు గుత్తులుగుత్తులుగా కాస్తుంది

స్త్రీ మొదట ప్రసవవేదన ననుభవిస్తేనేగాని
బంగారు బిడ్డను కని మురిసిపోదు

కనుక శ్రమపడందే ఫలితం లేదు, చావందే జీవంలేదు
అందుకే గాబోలు నీవు శిష్యులతో
తన ప్రాణాలు కాపాడుకొనేవాడు నశిస్తాడనీ
తన ప్రాణాలు వదలుకొనేవాడు బ్రతుకుతాడనీ చెప్పావు
ప్రభూ! మా మట్టుకు మాకు ఈ సత్యం సులువుగా బోధపడదు
స్వార్థంకొద్దీ మాలోని అహాన్ని
భద్రంగా సంరక్షించుకోగోరుతాం
ఆయహాన్ని మురిపించుకొనే ప్రయత్నంలో సర్వనాశమౌతాం
మరి నీవేమి చేసావు?
నీవు విత్తేవాడివీ విత్తనానివీ కూడ