పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దివ్యసత్ర్పసాదాన్ని నెలకొల్పాడు. ఈ దివ్యసత్ర్పసాదం రాబోయే సిలువ మరణాన్ని సూచిస్తుంది. కనుకనే దీన్ని నా జ్ఞాపకార్థం చేయండి అని ఆదేశించాడు ప్రభువు. అంచేత దివ్యసత్ర్పసాదంలో పాలుగొనేపుడెల్లా ప్రభువు సిలువ మరణాన్ని ప్రకటిస్తూంటాం. ఈలా ప్రభువు రెండవ రాకడ వరకూ ఈ దివ్యసత్రసాదబలిని మన పీరాలపై కొనసాగిస్తూంటాం. ఇదే మన మర్పించే పూజబలి.

ఇక యీ దివ్యసత్రసాద బలికి, లేక పూజబలికి, గ్రీకు బాషలో "కృతజ్ఞతాస్తుతి" అని పేరు. ఎందుకనగా ఈబలినెలకొల్పకముందు ప్రభువు తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. క్రైస్తవ ప్రజలమైన మనం సమర్పింపగల కృతజ్ఞతా ప్రార్థనలన్నిటిలోను శ్రేష్టమైంది ఈ పూజబలి. అంచేత క్రైస్తవభక్తుడు పూజబలిలో పాల్గొనడం ద్వారా ప్రభువుకి అతని తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుండాలి.

36. ఆ తొమ్మిది మంది యేరి -లూకా 17, 18

ఓ మారు పదిమంది కుష్టరోగులు ప్రభువును కలసికొని ఆరోగ్యం ప్రసాదించమని వేడుకున్నారు. మీరు వెళ్లి ఆరోగ్యం పొందినట్లుగా దేవాలయంలోని యాజకులకు తెలియజేసికొమ్మన్నాడు ప్రభువు. అలా వెళుండగా వాళ్ల కుష్ట పోయింది. తొమ్మిదిమంది వాళ్ల త్రోవన వాళ్లు వెళ్లారు. ఒకడు మాత్రం ప్రభువు దగ్గరకు మరలివచ్చి కృతజ్ఞత తెలియజేసాడు, ఆ వచ్చినవాడు యూదుడుకాడు, సమరయుడు. అప్పడు ప్రభువు చాలబాధపడి "పదిమంది శుద్దులయ్యారు. ఐనాగని ఈయన్యుడొక్కడు దప్ప శుద్దులైన యూదు లెవ్వరూ తిరిగి రాలేదుగదా? ఆ తొమ్మిదిమందిగూడ వచ్చి కృతజ్ఞతాస్తతు లర్పించి దేవుని మహిమపరచి వండాల్సింది గదా!" అన్నాడు. కనుక ఈ సందర్భాన్నిబట్టి మనం కృతజ్ఞతా భావం కలిగి వుండాలనే ప్రభువు కోరుకుంటూంటాడు అని తేటతెల్లమౌతుంది. అంచేత కృతజ్ఞతా ప్రార్ధనం మరచిపోవడం ఓ పెద్ద దోషంగా భావించాలి.

37. ఏయే మేలికార్యాలు

ఏయే మేలికార్యాలు తలంచుకొని కృతజ్ఞతా వందనాలు అర్పించాలి? మనం పొందే మేలులన్నిటినీ మూడు వర్గాలుగా విభజించవచ్చు. మొదట అందరితో బాటు మనమూ అనుభవించే ప్రాకృతిక వరాలున్నాయి. వీటి జాబితా చాల పెద్దది, ఇక్కడ కొన్ని విషయాలు మాత్రం గమనిద్దాం : 1. మన పుట్టువు, జగత్ సృష్టి, ఆకాశం, నీళ్ళ గాలి, ఋతువులు, చెట్టుచేమలు, పశుపక్ష్యాదులు, 2. మన ఆరోగ్యం, తెలివితేటలు, చదువుసంధ్యలు, బ్రతుకుదెరువు, ఉద్యోగాలు, 3. మన కుటుంబం, బంధువులు,