పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

స్నేహితులు. ఇరుగుపొరుగువాళ్లు. 4 వినోదాలు, సెలవులు. ఆటపాటలు, ఉల్లాస కార్యక్రమాలు. 5, మనదేశం, స్వాతంత్ర్యం, సంస్కృతి సంరక్షణ మొదలైనవి. ఈ భాగ్యాలన్నిటికీ ప్రభువునకు వందనాలు అర్పించాలి.

ఆమీదట, క్రైస్తవ ప్రజలంగా మనం అనుభవించే ఆధ్యాత్మిక వరాలున్నాయి. 1. ప్రభు జననం, బోధలు, మరణిజ్ఞానాలు, రక్షణం, పరిశుద్దాత్మ బైబులు దేవద్రవ్యాను మానాలు 2. మన జ్ఞానస్నానం, విశ్వాసం క్రైస్తవవిద్య, క్రైస్తవ జీవితం, దివ్యపూజ, సత్రసాదం, 3. మరియమాత పునీతులు, ధన్యమరణం, మోక్షభాగ్యం, ఈ యాధ్యాత్మిక భాగ్యాలన్నిటికీ ప్రభువునకు కృతజ్ఞత తెలియజేయాలి.

కడన, మనకు లభించిన ప్రత్యేక వరాలు కూడ వున్నాయి. 1. దేవుడు నాకు ప్రత్యేకంగా అనుగ్రహించిన తెలివితేటలు, పెద్దచదువు, ఆరోగ్యం, 2. నాశక్తి సామర్థ్యాలు, నాలోని మేలిగుణాలు, నా యాస్తిపాస్తులు. 3. నా పిలుపు, ప్రభువు నాకనుగ్రహించిన అంతస్తు, ఈ ప్రత్యేక వరాలకూ ప్రభువునకు వందనా లర్పించాలి.

ఈలా, యిసుక రేణువులనైన లెక్కపెట్టవచ్చు గాని ప్రభువు మన కనుగ్రహించే వరాలను, మనకు చేసే మేలికార్యాలను లెక్కిడలేం - కీర్తన 139, 18. కనుక ఈ భాగ్యాలన్నిటికీ జీవితాంతం కృతజ్ఞలమై వుండాలి.

38. ఎప్పడెప్పడూ?

ఎప్పుడెప్పడు కృతజ్ఞతా ప్రార్థనను సమర్పిస్తుండాలి? ఉదయమూ రాత్రికృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తూ ప్రభుని స్తుతించమన్నాడు కీర్తన కారుడు – 92, 2. అనగా నిత్యము ప్రభుని స్తుతించమని భావ. అంచేత మనం అప్పడు ఇప్పడు అనే నియమం లేకుండ ఎప్పడూ ప్రభుని స్తుతిస్తూనే వుండాలి. తల్లిదండ్రులను ప్రేమించడానికి పసిబిడ్డకు ఓ ప్రత్యేకమైన కాలమంటూ వుండద. ఈలాగే మనమూ ఎప్పడూ ప్రభుని కీర్తిస్తుండాలి.

ఒకోమారు చాలా యేండ్లు గడచినపిదప గూడ అధ్యాత్మిక జీవితంలో మనమట్టే వృద్ధి చెందం. మొదట యొక్కడ ప్రారంభించామో అక్కడే వుండిపోతాం. దానికి చాల కారణాలుండవచ్చు కాని దేవునిపట్ల కృతజ్ఞతా భావం చూపకపోవడమనేది కూడ తప్పకుండ ఓ కారణమై వుంటుంది. తాననుగ్రహించిన భాగ్యాలను స్మరించుకొని భక్తిభావంతో కృతజ్ఞతా ప్రార్థనలు సమర్పించని వాడంటే ప్రభువునకు అట్టే ప్రియంగలుగదు. అందుచేత అట్టివాడు . ఆధ్యాత్మిక జీవితంలో అట్టే ముందడుగు వేయలేడు. కనుక మనం అవస్యంగా కృతజ్ఞతా ప్రార్థనకు అలవడాలి.

ఇంతవరకు కృతజ్ఞతా ప్రార్థనను గూర్చి ముచ్చటించాం. ఇక ఆరాధన ప్రార్థనను అవలోకిద్దాం.