పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

4. కృతజ్ఞతా ప్రార్ధనం

33. గుఱ్ఱాన్ని రౌతుని సముద్రంలో కూలద్రోసాడు - నిర్ధ 15, 1

మోషే నాయకత్వం క్రింద యిస్రాయేలీయులు ఈజిప్టునుండి వెడలివస్తున్నారు. కాని ఐగుప్రీయులు యిస్రాయేలీయులను వెన్నాడార. అప్పడు మోషే ఆధిపత్యాన యిస్రాయేలీయులు సురక్షితముగా రెల్లసముద్రమదాటి ఆవలకు వెళ్లార. ఐగుప్రీయులు మాత్రం యుద్ధవీరుడైన యావేకు లొంగిపోయి సముద్రములో మునిగిపోయారు. వాళ్ళూ వాళ్ల రథాలూ, గుఱ్ఱాలు అన్నీనీటగలసిపోయాయి. ఇది యావేప్రభువు యిప్రాయేలీయులకు అనుగ్రహించిన రక్షణం. ఈ యద్భుత రక్షణాన్నిస్మరించుకుంటూ, సముద్రం దాటివచ్చిన వెంటనే మోషే యావేను స్తుతించి గానం చేసాడు - నిర్ధ 15, 1-21. ఈలా ప్రభువు చేసిన మేలి కార్యాలను తలంచుకొని అతన్నిస్తుతించడమే కృతజ్ఞతాప్రార్ధనం. బైబులు మొదటినుండి చివరిదాకా ఈ కృతజ్ఞతా ప్రార్థనలతో నిండివుంటుంది. క్రెస్తవ భక్తుడు గూడ చిన్ననాటినుండి ఈ కృతజ్ఞతా ప్రార్థనకు చక్కగా అలవాటు పడుతూండాలి.

34. మన మహాదేవుడు విమోచకుడునైన యేసుక్రీస్తు - తీతు 2,13

పూర్వ వేదంలోని ప్రభువు విశేషంగా విమోచకుడు అన్న. ఆ ప్రభువు అనుగ్రహించిన ఈజిప్టు దాస్య విమోచనాన్ని పురస్కరించుకొని యిప్రాయేలు ప్రజలు అతన్ని స్తుతించారు అన్నాం. ఇక నూతనవేదపు ప్రభువైన క్రీస్తుకూడ ప్రధానంగా విమోచకుడు. మనం ఫరోకు గాదు, పిశాచానికి దాసులం, ప్రభువు సిలువపై మరణం జెంది ఈ పిశాచ దాస్యాన్నుండి మనకు విముక్తి గలిగించాడు. మనమూ ఓ రెల్లుసముద్రం దాటిపోతాం, అదే మన జ్ఞానస్నానం, మనమూ ప్రభువుతో ఓ నిబంధనం చేసికుంటాం. ఇది కూడ మన జ్ఞానస్నాన సమయంలోనే జరుగుతుంది. మనమూ ఓ వాగ్రత్త భూమిలో అడుగిడతాం. అదే మన మోక్షం. మన మోషే, మన నాయకుడు, మన ప్రభువు క్రీస్తు ఈరీతిగా పూర్వవేదపు రక్షణ మంతాగూడ నూత్న వేదంలో మల్లా కొనసాగిపోతుంది. అంచేత నూత్నవేద ప్రజలమైన మనం నిత్యం ప్రభువైన క్రీస్తును స్తుతించి గానంచేస్తూవుండాలి. అతనికి కృతజ్ఞతాస్తుతులు వందనాలు అర్పిస్తూ వుండాలి.

35. ప్రభువైన యేసు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి - 1 కొరి 11, 23.

నూత్న వేదపు దేవుడు ప్రధానంగా విమోచకుడు అన్నాం. అతడు విమోచకు డైంది విశేషంగా సిలువ మరణం ద్వారా. ఈ సిలువ మరణానికి ముందు ప్రభువు