పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/236

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నీరూ నెత్తురూ ఏకధారగా స్రవించాయి

ఆ నీరు ఆత్మనీ, ఆ యాత్మద్వారా సిద్ధించే

జ్ఞానస్నాన సంస్కారాన్నీ చూచిస్తుంది

కనుక ప్రభూ! ఏవిధంగా జూచినాగానీ

మాకు ఆత్మ నొసగేవాడివి నీవే

ఏనుగుపడితే ఏనుగే లేపాలి అంటారు

దైవవ్యక్తియైన ఆత్మను దైవవ్యక్తివైన నీవే దయచేయాలి

ప్రభూ! నీ యాత్మను మాకు సమృద్ధిగా ప్రసాదించు

మేము జ్ఞానస్నానంలోనే స్వీకరించిన ఆ యాత్మను

స్వయంకృషితో, స్వీయభక్తితో, వ్యక్తిగత ప్రార్థనతో

రోజురోజుకీ అధికాధికంగా వృద్ధి జేసికొనే భాగ్యాన్ని దయచేయి

నాడు నీవు ప్రారంభించిన రక్షణేద్యమాన్ని

నేడు ఈ మంటివిూద కొనసాగించేది నీయాత్మే గనుక

ఆ పావనాత్మ నాయకత్వం క్రిందనే నీ భక్తులమైన మేము

మా క్రైస్తవ జీవితయాత్రను నాడునాటికీ ఫలప్రదంగా

కొనసాగించుకొనే మహాభాగ్యాన్ని మాకెల్లరికి అనుగ్రహించు.

24. రెండవ నాయకుడు

సంఖ్యా 27,22-23, 1రాజు 19,19-21. యోహా 16,7. 2కొరి 12,3.

ప్రభూ! పూర్వం యూదులు ఎడారిలో ప్రయాణం చేసినపుడు


మోషే తర్వాత యోషువా నాయకుడై

ఆ ప్రజలను వాగ్దత్త భూమికి చేర్చాడు

అలాగే యేలీయా తర్వాత యొలీషా ప్రవక్తయై

యిస్రాయేలు దేశంలో యావేమతాన్ని నిలబెట్టాడు

ఈలా మొదటి నాయకుని తర్వాత రెండవ నాయకుడు వచ్చి

ఆ మొదటి నాయకుని ఉద్యమాన్ని కొనసాగించడం

పూర్వవేదంలో కన్పించే సంప్రదాయం

ఈ సూత్రం ప్రకారం క్రీస్తు మోక్షారోహణం చేసాక

రెండవ నాయకుడైన ఆత్మడు విజయంచేసాడు

తండ్రిని చేరిన క్రీస్తే ఈ రెండవ ఆదరణకర్తను పంపాడు