పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/237

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇక నేడు క్రీస్తు ఉద్యమాన్ని కొనసాగించేది ఈ యాత్మడే

ప్రభూ! నీవు ఒకే దేవుడవైనా

ముగ్గురు వ్యక్తులతో కూడినవాడివి

కనుకనే నీవు మూడు దశల్లో

నిన్ను గూర్చి ప్రజల కెరుకపరచుకొన్నావు

తొలుత ప్రజలకు తండ్రినిగూర్చి మాత్రమే తెలిసింది

తర్వాత క్రీస్తునిగూర్చి కూడ తెలిసింది

కడపట ఆత్మనుగూర్చీ తెలిసింది

ఈ మూడు దశలూ క్రమంగా పితృశకం,

క్రీస్తుశకం, ఆత్మశకం అని పిలువబడతాయి

ఇప్పుడు మేము ఆత్మశకంలో వున్నాం

ఇక లోకాంతంవరకూ ఈ యాత్మశకమే కొనసాగుతుంది

నీలో నాల్గవవ్యక్తి లేడు కనుక నాల్గవ శకం లేదు

కనుక రెండవరాకడదాకా గూడ

ఆత్మడే యిక మాకు నాయకుడు

ఆ యాత్మడు కూడ మమ్మ తన చెంతకుకాక

క్రీస్తు చెంతకే చేరుస్తుంటాడు

అతని అనుగ్రహం లేందే మేము యేసే ప్రభువని యెంతమాత్రమూ విశ్వసించలేం

ఇప్పుడు మేమంతా ఆత్మశకంలో వున్నాం గనుకనూ

ఆత్మద్వారా తప్ప క్రీస్తును చేరలేం గనుకనూ

ఆ యాత్మనిపట్ల మేము భక్తిని

అత్యవసరంగా పెంపొందించుకోవాలి

అన్ని భక్తిమార్గాలకంటే ఈ యాత్మభక్తి అతిముఖ్యమైంది.

25. జీవజలం

కీర్త42,1-2, 63,1. యిర్మీ 2,13. యోహా 4, 13-14, 19,34. దర్శ 21, 6

తండ్రీ! నీవు జీవనప్రదమైన జలానివి

ప్రతి నరుడూ నీనుండి జీవజలం త్రాగి దప్పిక తీర్చుకోవాలి

కావుననే నీ భక్తుడైన కీర్తనకారుడు