పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/235

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

23. క్రీస్తు దయచేసే ఆత్మ

సంఖ్యా 20,11, 1కొరి 10,4, యోహా 4, 10.7, 37-39

అచ 2,33. యోహా 19,30, 19,34

క్రీస్తూ! పితనుండి బయలుదేరే ఆత్మ

నీ ద్వారా మా హృదయాల్లోకి ప్రవేశిస్తుంది

పూర్వం మోషే యెడారిలో మెరిబా చెంత

బెత్తంతో రాతిబండను చరమగా నీటిపాయ వెలువడింది

ప్రభూ! ఆ రాతిబండ నిన్నే సూచిస్తుందన్నాడు శిష్యుడు పౌలు

నీవు సుఖారు బావివద్ద సమరయ మహిళతో మాటలాడుతూ

"అమ్మా! నీవేగనుక దేవుని వరాన్ని గుర్తించి వున్నట్లయితే

ప్రస్తుతం నీతో మాటలాడుతుందెవరో తెలిసికొని వున్నట్లయితే

నీవే అతన్ని త్రాగటానికి నీళ్ళీయమని అడిగేదానివి

అప్పడతడు నీకు జీవజల మిచ్చివుండేవాడు" అని చెప్పావు.

ఈ జీవజల మేమోగాదు, పరిశుద్ధాత్మే

కనుకనే మరోసందర్భంలో యెరూషలేములో ఉపన్యసిస్తూ

"దప్పికగొన్నవాడు నా చెంతకువచ్చి దాహం తీర్చుకోవచ్చు

నన్ను విశ్వసించేవాడి హృదయాంతరంగంనుండి

జీవజలం పొంగిపారుతుంది" అని పల్కాపు

ఆ జీవజలప్రవాహం మరేమోగాదు పరిశుద్ధాత్మే

ఔను, నిన్ను నమ్మేవాళ్ళు నీనుండి ఆత్మను పొందుతారు

నీవు ఉత్థానంచెంది తండ్రి సమక్షాన్ని చేరుకొని

అతనినుండి ఆత్మను స్వీకరించావు

అలా స్వీకరించిన ఆత్మను

నిన్ను నమ్మే భక్తులమిూద కుమ్మరించావు

సువిశేషం నుడివినట్లుగా

నీవు సిల్వమీదికెక్కినీ యాత్మను వదిలావు

అనగా నీవు సిల్వపై చనిపోయి తండ్రిని చేరుకొని

ఆత్మను పొరజావు, అలా పొందిన ఆత్మను మామిూదికి ఊదావు

కనుకనే సిలువమిూద నీ ప్రక్కను బల్లెంతో పొడవగా