పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/228

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మా విూద నిరంతరం కోపింపవు
మా పాపాలకు తగినట్లుగా మమ్మ శిక్షింపవు
పిచ్చుకమిూద బ్రహ్మాస్త్రమా అన్నట్లుగా
మమ్మ చూచీచూడనట్లుగా వదలివేస్తూంటావు
దయా సముద్రుడవైన నీవు
మా పాపాలను పూర్తిగా మన్నిస్తావు
మా యపరాధాలను నీ కాళ్ళక్రింద తొక్కివేస్తావు
వాటిని సముద్రగర్భంలోనికి విసరివేస్తావు
నరులు వెలుపలి రూపాన్ని జూచి బ్రమపడతారు
కాని నీవు హృదయాన్ని పరిశీలిస్తావు
హృదయశుద్ధిగల మహానుభావులంటే నీకెంతో యిష్టం
నీవు అత్యున్నతమైన పరిశుద్ధ స్థలంలో వసించేవాడివైనా
వినయాత్మలూ పశ్చాత్తాప మనస్కులూఐన
నరుల హృదయాల్లోకూడ ప్రీతితో వసిస్తూంటావు
నీవు నీ యాజ్ఞలతో f భక్తులను నడిపిస్తూంటావు
ఈ లోకంలో నీ వాక్యం మాకు దీపంలా త్రోవజూపుతుంది
తల్లిపక్షి తన పిల్లలను రెక్కలతో కప్పినట్లుగా
నీవు నీ సేవకులను కాచికాపాడుతూంటావు
నీ భక్తులకు నిరంతరం కావలికాసే దేవుడవైన నీవు
కునికిపాట్లు పడనూపడవ, నిద్ర పోనూపోవు.

18. శాశ్వతుడైన దేవుడు

                                                    కీర్తన 102,25-27. యెష 40,6-8

ప్రభూ! నీకూ మానవమాత్రులమైన మాకూ
ఎంత యంతరం!
అసలు నీతో మాకు సఖ్యం కుదురుతుందా అనిపిస్తుంది
నీతో పోల్చుకొంటే మానవుని ఆయుష్మాలమెంత?
మునిమాపు నీడలాగ, మంచుతెరలాగ,
వాడిపోయిన గడ్డిలాగ, నరుడు క్షణమాత్రుడు
కాని నీవు మాత్రం శాశ్వతంగా మనేవాడివి