పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/227

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

17. తండ్రి గుణగణాలు

మత్త 6,26, 30, 5,45, కీర్త 104, 29-30, యెష 64,8-9.

యోబు 25, 54, 18. కీర్తన 103, 8–10. లూకా 7,19

.

1సమూ 16,7. యెష 57,15, కీర్త 119,105. కీర్త 121,4.

తండ్రీ! పక్షులు పైరులువేసి పంటలు పండించుకోవు
పాతరల్లో గాదెల్లో ధాన్యం దాచుకోవ
ఐనా నీవు వాటికి సకాలంలో తిండిపెడతావు
అలాగే పొలంలోని పిచ్చిమొక్కలు బట్టలు కుట్టించుకోవు
ఐనా నీవు వాటికి పూలనే రంగురంగుల దుస్తులు తొడుగుతావు
నీవు నీకు పోలికగా జేసిన నరునికి వీటికంటె అదనంగా
కూడూగుడ్డాయిలల్లావాకిలీ దయచేస్తావు
నీవు సజ్జనులకూ దుర్జనులకూగూడ సూర్యరశ్మిని దయచేస్తావు
సత్పురుషుల పొలాలమిూదా దుపుల పొలాలవిూదా గూడ
వానను ఒకేరీతిగా కురిపిస్తావు
మాలాగా కొందరిని కేటాయించి కొందరిని ఆదరించవు
నీవు భూమ్యాకాశాలను సృజించావు
కుమ్మరి మట్టితో కుండలను జేసినట్లుగా నరులను జేసావు
నీవు వూపిరిపోస్తే ప్రాణికోటి బ్రతుకుతుంది
ఊపిరితీస్తే జీవులన్నీ చస్తాయి
వెలుతురు చీకటిని సహించనట్లే
మహాపవిత్రుడవైన నీవు పాపాన్ని సహించవు
నీ కంటికి చంద్రుడూ నక్షత్రాలుకూడ నిర్మలంగా వుండవు
నీవు స్వర్గంలోని దేవదూతల్లోనే తప్పలు చూస్తావు
ఇక క్రిమి కీటకమూవంటివాడైన మట్టిమానిసిలో
నీకెన్ని దోషాలు కన్పించవు?
నీ యెదుట.మా పుణ్యకార్యాలెంత? మా పావిత్ర్యమెంత?
ఐనా నీవు కరుణామయుడవు, దయాపూరితుడవు
దీర్ఘశాంతుడవు, ప్రేమనిధివి
మేము పాపం చేసినప్పడుకూడ మమ్మ కటువుగా మందిలింపవు