పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/226

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గుబురుగా ఎదిగి ఏపుగా కొమ్మలు చాచేలా చేయి
మేము తీయని పండు గుత్తులుగుతులుగా ఫలించేలా చేయి
పుల్లని కాయలు కాసే వక్రబుద్ధినిగాని
అసలు ఫలించకుండావుండే దుష్టబుద్ధినిగాని మాకు పుట్టనీయకు

నీవు గృహనిర్మాతవైతే మేము నీవు కట్టిన గృహానిమి
పటిష్టమూ సుందరమూ ఐన భవనంగా మమ్మ తీర్చిదిద్దు
మేమంతా నీ మెస్సీయా అనే పునాదిరాతిమిూద నిల్చేలాచేయి
నీ శిష్యులమైన మేమంతా ఒక్క సమాజంగా ఐక్యంగావాలి
ఈ భక్త సమాజమనే మందిరంలో నీవు నిరంతరం వసిసూండు

నీవు వరుడవైతే మేము నీవు అనురాగంతో చేపట్టిన వధువమి
పూర్వవేద ప్రజలు నిబంధనంద్వారా వలె
నూతవేదంలో జ్ఞానస్నానంద్వారా మేము నీప్రజలమయ్యాం
కాని దుష్టవధువమైన మేము అవిశ్వాసంతో నీకు ద్రోహంచేస్తాం
నిన్ను విడనాడి నీవు చేసిన సృష్టివస్తువులవద్దకు లగెత్తుతాం
కనుక మా అంతరంగంలో నీపట్ల భక్తివిశ్వాసాలు పెంచు
మా హృదయంలో ప్రేమజ్యోతిని వెలిగించు
నీ సువిశేష బోధలద్వారా మాకు ప్రబోధం కలిగించు
అవిభక్త హృదయంతోను అనన్యచిత్తంతోను
ఏప్రొద్దు మేము నిన్ను సేవించేలా చేయి

నీవు తండ్రివైతే మేము నీ సంతానానిమి
కుమ్మరి మట్టితో కుండను చేసినట్లుగా నీవు మమ్మ చేసావు
జీవనాధారానివైన నీనుండి మేము
జీవనదాయక జలాలు గ్రిగోలాలి జ్యోతిర్మూర్తివైన నీనుండి దివ్యజ్యోతిని పొందాలి
తండ్రి బిడ్డలమిూదవలె నీవూ మామిూద నెనరుజూపు
మా పేరు నీ యరచేతులమిూద వ్రాసి వుంచుకొంటావనీ,
తల్లి తన ప్రేవున బుట్టిన బిడ్డను విస్మరించినా
నీవు మమ్మ విస్మరించవనీ మేము రూఢిగా నమ్మేలా చేయి.