పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/229

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఈ భూమికి పునాదులెత్తింది నీవు పైయాకాశాన్ని ఓ fogoeyero నిర్మించింది నీవు ఈ భూమ్యాకాశాలు గతిస్తాయిగాని నీవు మాత్రం గాలిలేని తావులోని దీపంలాగ ఎల్లకాలమూ నిశ్చలంగా వెలుగుతూనే వుంటావు నరుడు చినిగిపోయిన బట్టను తొలగించి క్రొత్త పట్టాన్ని ధరించినట్లే నీవుగూడ శిథిలమైపోయే భూమ్యాకాశాలను నిర్మూలించి మళ్ళా క్రొత్త సృష్టినిచేసి దాన్ని ఓ వలువలా ధరిస్తావు నీవు చేసిన యీ సృష్టి గతిస్తుంది గాని నీవు గతించవు ఏండూపూండు కడచినా వృద్ధత్వానికి గురికాకుండా ఎల్లప్పుడూ ఒకేరీతిగా వుండిపోతావు ప్రవక్త నుడివినట్లు నరులంతా తృణంలా క్షణమాత్రులు వాళ్ళ సౌందర్యం పూవులా వికసించి క్షణంలో వాడిపోతుంది వేడిగాలి సోకగానే గడ్డి కమిలిపోతుంది పూవు వాడిపోతుంది, నరుల బండారంగూడ యింతే నీ వాక్కు ఒక్కటిమాత్రం శాశ్వతంగా నిలుస్తుంది ప్రభూ! నీవు మమ్మ అనంత ప్రేమతో ఆదరించావు అశాశ్వతులమైన మా చెంతకు శాశ్వతమైన నీ వార్తను పంపావు ఆవార్త మానవమాత్రులమైన మమ్మ జేరి మా రూపం చేకొంది ఇందుకుగాను నీకు మా వందనాలు. 19. దైవసాన్నిధ్యం కీర్తన 139 ప్రభూ! నన్ను గూర్చి నీకు బాగా తెలుసు నేనేమి చేసినా, ఎక్కడికి వెళ్లినా నీవు గమనిస్తూనే వుంటావు నా హృదయంలోని ఆలోచనలను గుర్తిస్తూంటావు నానోట మాట రాకమునుపే నేనేమి చెప్తానో నీకు తెలుసు 221