పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/224

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నీవు కూడబెట్టిన యీ సౌత్తు అన్యుల పాలవుతుంది అన్నాడు
ఆ ధనికుడు ఆ రాత్రే కన్నుమూసాడు కనుక
రేపు అనే సుదినాన్ని కంటితో చూడనేలేదు
కనుక ప్రభూ! నేను ఆధ్యాత్మిక విషయాలను
రేపటికి వదలివేయకుండా వుండేలా చేయి
దీపముండగానే యిల్ల చక్కబెట్టుకోవాలికదా!
కావున నేను కూడూగుడ్డ కొరకు రోజూ ప్రాకులాడినట్లే
మోక్షభాగ్యం కొరకు గూడ రోజూ కృషిచేసేలా చేయి
అపుడు నేను తలవని తలంపుగా కన్నుమూసినా,
రేప అనే సుదినానికి నోచుకోకపోయినా,
నీ దర్శనభాగ్యాన్ని మాత్రం కోల్పోను.

15. సృష్టికర్త

                          ఆది 2,7. కీర్తన 8,4-7. యెష 64,8-9

ప్రభూ! నీవు ఆదిలో ప్రాణిసృష్టి చేసినపుడు
నేల మట్టినుండి నరాకృతిని జేసి
దానిలోనికి జీవవాయువు నూదగా
ఆ మృత్పిండం జీవించే ప్రాణి ఐంది
అతడే ఆది మానవుడైన తొలి ఆదాము
అప్పటినుండి నీవు నిరంతరం నరులను సృజిస్తూనే ఉన్నావు
స్త్రీపురుషుల శుక్రశోణితాలు మాతృగర్భంలో నెలకొనగా
నీవా మాంసపు ముద్దలోనికి జీవవాయువు నూదుతావు
ఫలితంగా నీ పోలిక కలిగిన సరుడు జన్మిస్తాడు
మానవమాత్రులమైన మేమంతా యిలా పట్టినవాళ్ళమే
నీవు చేసిన యీ భౌతికసృష్టిలో నరుడు ఉత్కృష్ణప్రాణి
అతడు నీకంటె కొంచెం తక్కువవాడు, నేలమిూద నీ ప్రతినిధి
నీ వతన్ని కీర్తిమహిమలనే కిరీటంతో అలంకరించావు
సాధుమృగాలు వన్యమృగాలు ఆకాశపక్షులు జలజంతువులు
మొదలైన జీవకోటి నంతటిని అతని పాదాలక్రింద వుంచావు