పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/223

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నీవు నా హృదయ దేవాలయాన్ని మరింత శుద్ధిచేసి
దానిలో నిరంతరమూ నెలకొనివుండు
నా అంతరంగాన్ని ప్రేరేపించి
నన్ను నీ మార్గంలో నడిపిస్తూండు
నా హృదయాంతరాళంలో వెలిగే భాగ్యదీపానివైన నిన్ను
గుప్పన ఆర్పివేసుకొనే దౌర్భాగ్యాన్ని మాత్రం
నీ దాసుడనైన నాకు ఏనాడూ పట్టనీకు.

14. రేపు అనే సుదినం వచ్చేనా?

                                        మత్త 6,27.5,36 కీర్త 90,5. లూకా 12, 16-20

తండ్రీ! నేను ఐహిక వస్తువులకోసం చీమలా ప్రాకులాడతాను
కాని పరలోక భాగ్యాలను పట్టించుకొనే పట్టించుకోను
ఈరోజు ఎగిరెగిరి పాపకార్యాలకు పూనుకొంటాను
రేపు వాటికి పశ్చాత్తాపపడవచ్చులే అనుకొంటాను
కాని ఆ రేపు అనేది నా స్వాధీనంలో వుంటుందా?
నేను నా యెత్తుని అంగుళం పెంచుకోలేను
నా ఆయుఃప్రమాణానికి ఒక్క క్షణం చేర్చుకోలేను
నా నరసిన వెండ్రుక నొక్కదాన్ని నలుపుగా చేసికోలేను
నా ఆయుస్సు ఓ కలలాగ, ఓ మంచుతెరలాగ
ఇవ్వాళ వుండి రేపెoడిపోయే. గడ్డిలాగ, క్షణికమైంది
మరి నేనా రేపటి రోజుకి కర్తను?
సువిశేషకథలోని ధనికుడేమనుకొన్నాడు?
నాకీ యేడు పంటలు పుష్కలంగా పండాయి
క్రొత్తకొట్ల కట్టించి ధాన్యం నిల్వజేయిస్తాను
చాల యేండ్లవరకు హాయిగా తిని త్రాగుతాను
ఇక దేవుణ్ణిగాని తోడి నరుజ్జీగాని పట్టించుకోవలసిన
అవసరమేమంది అని తలంచాడు
నాస్తికత్వమంటే యిది కాదా? మరి దేవుడేమని పల్కాడు?"
ఓరీ మందమతీ! ఈ రాత్రే నీ ప్రాణాలు తీస్తాను