పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/225

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నీవు చేసిన సృష్టికంతటికి అతన్ని అధిపతిని చేసావు
దేహధారుల్లో నరుడంతటివాడు లేడు
నీవు స్వర్గానికి రాజువైతే అతడు భూమికి రాజు
తండ్రీ! నీవు నాకు ఇంత శ్రేష్టమైన నరజన్మ నొసగావు
ఈ జన్మను నేను సార్ధకం జేసికొనేలా చేయి
నేను నీకూ నీవు చేసిన తోడిజనులకు సేవలు చేసేలా చేయి
పుట్టలోని చెదల్లాగ పట్టిగిట్టితే యేమి లాభం?
నీవు పట్టగలిగిన వాళ్ళలోకూడ అందరినీ గాక
కొందిరిని మాత్రమే పుట్టిస్తావు – ఆ కొందరిలో నేనూ వొకట్టి
ఇందుకు నేను నీకు నిరంతరం వందనాలర్పించాలి
దుమ్మూధూళినైన నేను ఎగిరిపడగూడదు
మట్టిముద్దమైన ఆదాము పత్రుని బండారమెంత?
నీవు నరుడ్డి స్మరించుకోడానికి అతడెంతటివాడు?
కుండ కుమ్మరిమిూదా, బల్ల వడ్రంగిమిూదా తిరగబడకూడదు
కనుక నేను నీకు లొంగివుండేలా చేయి
నాలోని పొగరుబోతుతనాన్ని అణచివేయి
నీపట్ల వినయవిధేయతలు ప్రదర్శిస్తూ
నీ బంటునుగా జీవించే భాగ్యాన్ని దయచేయి.

16. ఐదు ఉపమానాలు

ప్రభూ! నీవు కాపరివైతే మేము నీవు మేపే మందం
మమ్మ అపమార్గం పట్టనీక తిన్నని త్రోవలో నడిపించు
రోజురోజు నీ పవిత్ర గ్రంథాలనే పచ్చికపట్టుల్లో మేపు
సకలాపదలనుండీ అనర్గాలనుండీ మమ్ము కాపాడు
నీవు నాయకుడవై మా ముందు నడుస్తూ
మమ్మ నీవెంట గొనిపో
మేము నీ స్వరాన్ని విని నిన్ననుసరించి వచ్చేలా చేయి

నీవు కాపవైతే మేము నీవు నాటిన ద్రాక్షతోటం
ఎరువేసి నీరుకట్టి నీ ద్రాక్షలమైన మేము