పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/222

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

13. పాపాన్ని తొలగించే దేవుడు

యెహెజ్కేలు, 33,11. లూకా 15,21. కీర్త 103,10.
                              మత్త 9,13. లూకా 15,5. లూకా 23.43. హెబ్రే 7,25.
                                 1కొరి 6,19. రోమా 8,14. 1తెస్స 5,19.

తండ్రీ! నీవు పాపి నాశంకావాలని ఏనాడూ కోరుకోవు
అతడు పరివర్తనం చెంది మళ్ళా బ్రతకాలనే కోరుకొంటావు
కనుక నేనూ ఆ దుడుకుచిన్నవాడిలాగే
బిరాన నీ సన్నిధిలోకి తిరిగివచ్చి
తండ్రీ! నీకు ద్రోహంగా పాపం చేసాను
ఇకవిూదట నీ కుమారుడ్డి అని
పిలిపించుకోవడానికి యోగ్యుణ్ణి కాను
అని మనవిచేసికొంటున్నాను
నీవు ఈ పాపిని కరుణతో ఆదరించు
సహనమూర్తివీ దీర్ఘశాంతుడవూ ఐన నీవు
నా పాపాలకు తగినట్లుగా నన్ను దండించవద్దని
నీ యెదుట చేతులెత్తి మనవిచేసికొంటున్నాను.

క్రీసూ! నీవు పాపులను పిలువవచ్చానని చెప్పకొన్నావు
ఆ తప్పిపోయిన గొర్రెనులాగే నన్నూ
నీ భుజాలమిూద మోసికొనివచ్చి
తిరుగా మందలో చేర్చు
ఆ మంచి దొంగకులాగే నాకు గూడ
నేడే నీవు నా రాజ్యాన్ని చేరుకొంటావని అభయమిూయి
ఇంకా, నీవు స్వర్గంలో తండ్రి సమక్షంలో వుండి
ఈ లోకంలో ఏప్రాదూ శోధనలకు గురయ్యే నాకోపం
విజ్ఞాపనంచేసి, నన్ను పిశాచ శోధనలనుండి కాపాడు.

ఆత్మమా! నీవు దేవునికి పోలికగా వుండే నరులను
పాపమాలిన్యంనుండి శుద్ధిచేసేవాడివి
నేను నీవు వసించే మందిరాన్ని కనుక