పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/221

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

 నికృష్ణపు ద్రాక్షతోటలాంటిది,
నెర్రెలు విచ్చినందున తనలో నీళ్ళ నిల్చుకోజాలని
రాతి చట్టలోని తొట్టిలాంటిది,
ముండ్లపొదలతో నిండిపోయి పంటపండక
దేవుని శాపానికి గురైన పాడు పొలంలాంటిది,
అన్నిటినీ యూడ్చుకొనిపోయే భీకరప్రవాహంలాంటిది,
నరులు మోయలేని పెనుభారంలాంటిది,
భయంకరమైన విషసర్పంలాగ దుష్టమైంది,
తెరువబడిన సమాధిలాగ దుర్గంధ మొలికేది,
పాపం కట్టుకోవడమంటే పందిలాగ బురదలో పొర్తాడ్డం,
కుక్కలాగ కక్కిన కూటిని మరల మింగడం,
కయీను బిలాము యూదా లాంటి పాపులు
పోయిన త్రోవలో పోవడం
కనుక మేము కిల్బిషాన్ని ఎంతయినా అసహ్యించుకోవాలి
మా పాపాలవల్ల మాకు ఎర్రని మచ్చలు పడతాయి
కాని పవిత్ర మూర్తివైన నీవు మమ్ము కడిగి
మంచులా శుభ్రం చేస్తావు
మా పాపాలు ఎర్రగావున్నా
మేము పన్నివలె తెల్లనయ్యేలా చేస్తావు
మా యపరాధాలను నీ కాళ్లక్రింద త్రోక్కివేస్తావు
వాటినెత్తి నడిసముద్రంలోనికి విసరివేస్తావు
మా తరపున మేము చిత్తశుద్ధితో
మా తప్పిదాల నొప్పకొంటే నీవు వాటిని పూర్తిగా క్షమిస్తావు,
మరల జ్ఞప్తికి తెచ్చుకోవు
కావున నా తమ్మునికి నేనేమైనా కావలి వున్నానా
అన్న కయీనులాగ మా దోషాలను మేము కప్పిపెట్టేకోగూడదు
నేను ప్రభువుకి ద్రోహంగా పాపం చేసాను అన్న దావీదులాగ
మా దుష్కార్యాలను పూర్ణహృదయంతో అంగీకరించాలి
పిడికెడు మట్టిముద్దలమూ బలహీనపు ప్రాణులమూ ఐన మేము
ఈ నిజాయితీని ప్రసాదించమని
నిన్ను వినయంతో వేడుకొంటున్నాం,

213