పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/216

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఒక్కపండుకూడా లేని ఆ చెట్టు నీకు నిరాశ పుట్టించింది
నీవు దాన్ని శపించగా అది నిలువున యెండిపోయింది
ఆ పండ్లచెట్టు కలవాడు దిగులుపడడా అని మేము ప్రశ్నిస్తాం
కాని ఆ యుత్తిమ్రానుని శపించడంలో నీ వద్దేశం వేరు
పూర్వం ప్రవక్తలు తమ బోధలను నటించి చూపించారు
యిర్మీయా నడివీధిలో క్రొత్తకుండను పగులగొట్టి
పాలస్తీనా దేశం కూడ అలాగే ముక్కలౌతుందన్నాడు
అగబు పౌలు నడికట్టుతో తన కాలు సేతులు బంధించుకొని
ఈ నడికట్టును ధరించిన పౌలుని
యూదులు ఈలాగే బంధిస్తారని పల్మాడు
ఈరీతినే నీవు కూడ కొన్ని బోధనలను నటించి చూపించావు
ఇక్కడ ఈ యంజూరం యిస్రాయేలు ప్రజలకు గుర్తు
నీవు ఎంత బోధించినా వాళ్లు పరివర్తనం చెందడం లేదు
ఆ ప్రజలు పశ్చాత్తాప ఫలాలను ఫలించడమే లేదు
కనుక ఆ జనులు తండ్రి శాపానికి గురౌతారు
ఈ యెండిపోయిన చెట్టులాగే వాళ్ళకూడ శుష్కించిపోతారు
ఈ సత్యాన్ని బోధించడానికే నీవీ యంజూరం సామెతను
కన్నులకు కట్టినట్లుగా నటించి చూపించావు
ఇక, ఈ నటనాత్మకమైన అత్తిప్రూని సామెత
నేటి మా జీవితానికికూడ అక్షరాల వర్తిస్తుంది
మేము కూడ పాపంనుండి వైదొలగుతూండాలి
ఎప్పటికప్పుడు పశ్చాత్తాపపడి నీ మన్నన పొందుతూండాలి
సహనవంతుడవైనా నిన్ను దీర్ఘకాలం విసిగించకూడదు
పరివర్తనం చెందక, పశ్చాత్తాపానికి లొంగక
రాతిబండలాంటి గుండెతో అలాగే వండిపోతే
మేము కూడ నీ శాపానికి జిక్కి వ్రుగ్గిపోతాం
నీవు నెనరుతో పాపిని కరుణించినా
ఆ పాపి పాపాన్ని మాత్రం ఎంతో అసహ్యించుకొంటావు
పరిశుద్దుడవైన నీవు కిల్బిషాన్ని ఏలా సహిస్తావు
కనుక ప్రభూ! సకాలంలో పశ్చాత్తాప ఫలాలను
ఫలించే భాగ్యం పాపులమైన మాకు నిత్యం ప్రసాదిస్తూండు.