పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/215

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కనుక మనం అతన్ని పూర్ణహృదయంతో ప్రేమించాలి

పైగా మనలను మనం ప్రేమించుకొన్నట్లే

ఇరుగుపొరుగువాళ్ళను గూడ నిండుమనస్సుతో ప్రేమించాలి

మోషే ధర్మశాస్త్రంలోని ఇతరాజ్ఞ లేవికూడ

ఈ రెండాజ్ఞలతో సరితూగజాలవు

ధర్మశాస్త్రమంతా, ప్రవక్తలు పల్కిన బోధలన్నీ

చాలా వస్తువులు ఒక వంకెమిూద వ్రేలాడినట్లుగా

భవనం పునాదిమిూద నిల్చినట్లుగా

ఈ ప్రేమాజ్ఞవిూదనే నిలుస్తాయి" అని చెప్పాడు

అతని మాటలను మెచ్చుకొనిన ధర్మశాస్త్ర బోధకుడు

"నిజమే ప్రేమాజ్ఞ అన్నిటికంటె శ్రేష్టమైంది

బలులకంటే దహనబలులకంటె అది గొప్పది" అన్నాడు

క్రీస్తుకూడ అతని ధర్మనిష్టను కొనియాడుతూ

బాబూ! నీవు దైవరాజ్యానికి చేరువలోనే ఉన్నావన్నాడు

తండ్రీ! మేముకూడ ఈ యాజ్ఞను పాటిస్తే చాలు

నీకు ప్రియపడతాం

ఒకే నది రెండుపాయలుగా చీలినట్లు,

ఒకే చెట్టు రెండు కొమ్మలుగా చీలినట్లు

ఒకే ప్రేమాజ్ఞ రెండు కట్టడలుగా కన్పిస్తుంది

దేవుణ్ణి ప్రేమించినా నరుణ్ణి ప్రేమించినా ప్రేమేమో ఒక్కటే

మేము నిరంతరం ఏవేవో నియమాలతో

ఏవేవో ఆచారాలతో సతమతమౌతూంటాం

కాని ఈ ప్రేమాజ్ఞ నొక్కదాన్ని పాటిస్తే చాలు

మా పుట్టవు చరితార్థమౌతుంది

పూర్వనూత్న వేదాలు రెండింటికీ పునాది ఈ యాజ్జీగన్క

దీన్ని ఒక్కదాన్ని అనుసరిస్తేచాలు మా జీవితం ధన్యమౌతుంది.

8. కాయలు కాయని అంజూరం

మత్త 21,18-20. యిర్మీ 19,10-11. అచ 21, 10-11

క్రీసూ! ఓమారు నీవు యెరూషలేముకు ప్రయాణంచేస్తూ

ఆకలిగొని పండ్లకొరకు ఓ అంజూరం దగ్గరి కెళ్ళావు 2O7