పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/213

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అందరి దానం కంటెగూడ ఆమె దానం
మిన్న అన్నావు శిష్యులతో
కలవాళ్లు తమ కల్మిలో కొంత దేవుడికిస్తే గొప్పేమిటి?
లేనివాళ్ళ తనకున్నదంతా దేవునికి కానుక పెడితే,
తమ బ్రతుకుతెరువునే ఆ తండ్రి పాదాలచెంత అర్పిస్తే
అదిగదా గొప్ప?
ప్రభూ! ఈ వుదారహృదయను నీవు మనస్పూర్తిగా పొగడావు
ఈ పేదరాలు నేడు మాకుకూడ ఆదర్శంగా వుంటుంది
మేము మా కానుకలను నీ కర్పించుకొంటేనే సరిపోదు
వాటికంటె ముఖ్యంగా మా హృదయాలను నీ కర్పించాలి
పండు నీయడంకంటె చెట్టు నీయడం ఘనం
అలాగే నీకు మా వస్తువుల నీయడంకంటె
మా యెడదల నర్పించుకోవడం ముఖ్యం
కనుక మేము నీ సన్నిధిలో చిత్తశుద్ధితో
హృదయార్పణం గావించుకొని
రోజువారి జీవితంలో ఆ యర్పణం ప్రకారం జీవించేలా జేయి
నిన్ను నమ్మి, నీ మీద ఆధారపడి
మా మనుగడను కొనసాగించుకొనే భాగ్యాన్ని ప్రసాదించు.

6. హృదయశుద్ధి



యిర్మీ 17,9. మత్త 15,19, యిర్మీ 31,38. యొహె 36,26-27,
కీర్త 51.16-17. యోహా 19,34.


ప్రభో! మా హృదయంలో వుండే కపటం అంతాయింతా కాదు
మేము ఒకటి తలచి ఇంకొకటి చెస్తాం
ఒకటి చెప్పి మరొకటి చేస్తాంగూడ
ఈలాంటి హృదయం నీకు ప్రియపడుతుందా?
కొందరు బాహ్యశుద్ధిని ఘనంగా యెంచుతారు
కాని అంతశుద్ధికదా ముఖ్యమైంది?
హత్యలూ వ్యభిచారాలూ దొంగతనాలూ ద్వేషాలూ
అబద్ధాలూ అసూయలూ కలహాలూ వంచనలూ