పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/214

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మొదలైన దుష్కార్యాలన్నీ పుట్టేది మొదట యెదలో కాదా?
మనిషిని మలినపరచేది డెందం కాదా?

కనుకనే యిర్మీయా క్రొత్త నిబంధన కాలం వస్తుందనీ
ఆ కాలంలో ప్రభువు తన ఆజ్ఞలను రాతిపలకవిూద కాక
నరుల హృదయాలమిూదనే లిఖిస్తాడనీ
ఫలితంగా ప్రజలు దైవభక్తులౌతారనీ పల్మాడు

ప్రభువు ప్రజలకు నూత్న హృదయాలను దయచేస్తాడనీ
వాళ్ళల్లోని రాతిగుండెలను తొలగించి వాటి స్థానే
మాంసపు గుండెలను నెలకొల్పుతాడనీ నుడివాడు యెహెజ్కేలు

ప్రభువుకి ప్రియపడేది జంతుబలులు కానేకాదనీ
పశ్చాత్తాపపూరితమైన హృదయం
అన్నిటికంటె శ్రేష్టమైనబలి అనీ వాకొన్నాడు కీర్తనకారుడు

ఇవి భక్తుల హృదయాంతరాళం నుండి వెలువడిన వాక్కులు
తండ్రీ! హృదయశుద్ధిలేని నరుడు నీకు నచ్చనే నచ్చడు
భాండశుద్ధిలేని పాకం ఎవరికి రుచిస్తుంది?
మరి మా కపట హృదయాన్ని చక్కదిద్దుకొనే మార్గమేమిటి
ప్రవక్తలు పల్కిన నిర్మల హృదయాన్ని పొందడమేగదా?
కనుకనే క్రీస్తు విచ్చేసి మా మానుషహృదయాన్ని చేకొన్నాడు
ఆ విశుద్ధహృదయాన్ని సిల్వమిద ఈటెతో పొడిచి తెరచారు
నేడు ఆ నిర్మలహృదయం మా పాపపు హృదయాలమిూద సోకి
వాటిని పునీతం చేస్తేనేతప్ప మాకు గతిలేదు.

7. ప్రేమాజ్ఞ


మార్కు 12,28–34. మత్త 22,40


తండ్రీ అన్నిటికంటె ముఖ్యమైన యాజ్ఞ యేదని
ధర్మశాస్త్ర బోధకుడు ప్రశ్నింపగా నీ కుమారుడైన క్రీస్తు
"మన దేవుడైన ప్రభువు ఏకైక ప్రభువు
అతనికి సాటి దైవం లేనేలేడు