పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/212

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అతనితో భోజనం చేస్తావు, అతనికి స్నేహితుడమోతావు

నిన్ను హృదయసదనంలో నిల్పుకొనేవాడుకదా పుణ్యపురుషుడు

నీ సాన్నిధ్యంవలన పులకించిపోయేవాడుకదా నిజమైన భక్తుడు

ప్రభూ! మోడుపడిన మా యెడదలను చిగురింపజేయి

మొద్దువారిన మా హృదయాలకు చైతన్యం పుట్టించు

చెరకుగడెనుండి రసం స్రవించినట్లుగా

తేనెపట్టనుండి తేనె చిప్పిలినట్లుగా

చెలమనుండి నీరు ఉబికివచ్చినట్లుగా

మా హృదయాలనుండి భక్తిరసామృతం

పొంగిపారేలా నీ చేయెత్తి మమ్మ దీవించు.

5. ఉదార హృదయ

మార్కు 12,41-43

ప్రభూ! చాలమంది ఉదారబదులు నీకు సేవలు చేసారు

నీ పిలుపు విన్పింపగానే పేత్రు అంద్రెయా

యోహాను యాకోబులు

తమ పడవలనూ వలలనూ అన్నిటినీ వదలి నీవెంట వచ్చారు

సుంకాల శాలలో కూర్చుండివున్న మత్తయికూడ

నీ పలుకాలించి తాను లెక్కబెట్టే సౌమ్మను అక్కడే వదలి

బిరాన నిన్ననుసరించాడు

కాని వీళ్ళందరికంటెగూడ ఉదారహృదయ ఆ పేద వితంతువు

నీవు దేవళం దాపులో హుండీవద్ద కూర్చుండి

భక్తులు కానుకలు వేసే తీరును పరికిస్తున్నావు

ధనికులు బారులుగా వచ్చి పెట్టెలో పెద్దమొత్తాలే వేసారు

అంతలో ఓ దరిద్ర వితంతువుకూడ వచ్చింది

ఆమె పైట చెంగున రెండే రెండు దమ్మిడీలున్నాయి

ఆ భక్తురాలు ఏవిూ సంకోచించకుండా,

ఉన్నదికూడపోతే తన బ్రతుకేమౌతుందో అని భయపడకుండా

ఆ రెండుకాసులూ విప్పి హుండీలో పడవేసింది

ఆ గుణవతి వదాన్య బుద్ధికి నీవు మురిసిపోయావు