పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/211

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

హృదయంలోని భక్తివల్ల నరుడు నీకు ప్రీతిని కలిగిస్తాడు

కనుక మార్త క్రియాశీలత మాకు చాలదు

మరియ మననశీలతకూడ మాకవసరం.

4. లూదియా

అచ 16,11-15. దర్శ 3,20

ప్రభూ! నీ భక్తులైన పౌలు లూకా శనివారం మునిమాపన

ఫిలిప్పి నగరంచెంత యేటియొడ్డున బోధచేస్తూంటే

చాలమంది యూదమహిళలు ఆసక్తితో వింటూన్నారు

కాని నీవు వారిలో లూదియా యనే యువిద యెడద తెరిచావు

దానితో ఆమె హృదయంలో భక్తి పొంగిపారింది

ఆమె క్రీస్తుని విశ్వసించి శిష్యురాలయింది


అపోస్తలులకు ఆతిథ్యంకూడ యిచ్చి సేవలు చేసింది

మాయంతట మేము ఎన్నిసారులు గ్రంథం చదివినా

ఎన్ని వుపన్యాసాలు విన్నా ఎన్ని ప్రార్థనలు చేసినా

ఎంత మొత్తుకొన్నా ప్రయోజనం లేదు

నీ వెవరి హృదయాలు తెరుస్తావో వాళ్ళకు భక్తిపడుతుంది.


రేయంతా కొలనులో ముడుచుకొనివున్న తామరమొగ్గ

ఉదయాన సూర్యకిరణాలు సోకగానే దోసెడంత పూవెతుంది


మూగవోయినట్లు పడివున్న సంగీతవాద్యం

విద్వాంసుని చేయి సోకగానే మధురగీతం పలుకుతుంది


అలాగే నీవు మా హృదయాన్ని తట్టగానే

అది భక్తిభావంతో పులకించిపోతుంది

భక్తి అనేది నీవు కరుణతో దయచేసే వరంగాని

మేము ప్రయత్నించి సాధించేది కాదు

ఔను, నీవు ఆనాడు ఆ లూదియా యెడదనులాగే

ఈనాడు మూ హృదయాలనుకూడ తడుతూంటావు

ఎవడు నీ ప్రబోధానికి లొంగి హృదయ కవాటం తెరుస్తాడో

ఆ భక్తుని ఎడదలోనికి నీవు అతిథివిగా విచ్చేస్తావు