పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/210

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఈ మరియు ప్రార్థనాపరులందరికీ ఆదర్శంగా వుంటుంది

ఈ భక్తురాలిలాగే మేమూ రోజూ కాసేపు

నీ వాక్యాన్ని ధ్యానించుకోవాలి

నీ పాదాలచెంత కూర్చుండి నీ బోధలను మననం చేసికోవాలి

నీ పవిత్రగ్రంధాన్ని భక్తివిశ్వాసాలతో

పారాయణం జేసికొనేవాళ్ళకు

నీవే స్వయంగా ఉపాధ్యాయుడవై బోధ చేస్తావు

ప్రార్ధనం చేసికొనేపడు మేము నీతో సంభాషిస్తాం

కాని వేదగ్రంథాన్ని పఠించేపుడు నీవే మాతో మాటలాడతావు

గ్రంథ పఠనంద్వారా నీవు మాకు చెప్పే సందేశాలను

మేము జాగ్రత్తగా వినాలి

నీ చిత్తాన్ని గ్రహించి నీ మార్గాల్లో నడవాలి

చీకటిలో పోయేవాడికి దీపం దారిచూపినట్లే

ఈ జీవితయాత్రలో నీ వాక్యం మాకు త్రోవజూపుతూంటుంది

ఈ లోక్రంలో మేమేమి చేయాలో ఏమి చేయకూడదో

విధి నిషేధాలద్వారా నీ పలుకు మాకు తెలియజేస్తూంటుంది

వాక్యమననం వలన మేము

నాడునాటికీ పరిపూర్ణ క్రైస్తవుల మౌతాం

కనుక దివ్యగ్రంథ పారాయణంపట్ల మాకు ప్రీతి పట్టించు

పూజపాపోచ్చారణాది దేవద్రవ్యానుమానాల భక్తి గాని

వేదవాక్య భక్తి మాకు లేశమైన లేదు

మేము నీ వాక్యమాధుర్యాన్ని చవిజూచే భాగ్యాన్ని ప్రసాదించు

ఈ లోకంలో రోజూ ఇన్ని పనులతో సతమత మౌతూంటాం

నీవు చేసిన సృష్టివస్తువుల్లోబడి నిన్ను విస్మరిస్తూంటాం

కాని నిన్ను ధ్యానించుకొనేవాళ్ళకు నీవు తోడుగా వుంటావు

మేమ ఉరికురికి కష్టపడి పనిచేసికోబోతాం

కాని నీ దీవెన వలన మా పనులు

నూరంతలు అదనంగా ఫలిస్తాయి

చాల పనులు చేసినందువలన కాక