పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/209

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మా హృదయంలో వసిస్తూంటుంది

తన సాన్నిధ్యంతో మమ్మ పవిత్రులను చేస్తూంటుంది

అందుకే హృదయానికి మించిన దేవాలయం లేదు

భక్తి హృదయంలో ప్రారంభం కావాలి

హృదయంలో భగవంతుడు లేనివాడికి

దేవళాల్లోను పుణ్యక్షేత్రాల్లోను దేవుడు దొరకడు

మేము ఎక్కడికి వెళ్ళినా

ఆ హృదయాన్నే మోసికొని పోతూంటాం గదా!

గొల్లవాడు గొర్రెను చంకన బెట్టుకొని ఊరంతా వెదకినట్లు

మా హృదయ సింహాసనం మిద ఆసీనుడవై యున్న నిన్నుగానక

నీకోసం ఎక్కడెక్కడో గాలిస్తుంటాం

ప్రభూ! మా యవివేకాన్ని మన్నించు

మేము అంతర్ముఖులమై

మా యెడదల్లోనేవున్న నిన్ను గుర్తించేలా చేయి

మా గుడిసె క్రిందనే దాగివున్న

బంగారు గనివైన నిన్ను గుర్తుపట్టేలా దయచేయి.

8. మరియామార్తలు

లూకా 10, 38–42

క్రీసూ! నీవు బెతనీ గ్రామంలో

మరియమార్తల యింటికి వెళ్ళగా

మార్త అన్నపానీయాది గృహకృత్యాలతో సతమతమౌతూంది

మరియు మాత్రం నీకు శిష్యురాలై నీ పాదల చెంత కూర్చుండి

నీవు బోధించే పరలోకపుతండ్రి గుణగణాలను శ్రద్ధతో వింటూంది

మార్త తనకు సాయంచేయడానికి చెల్లెలిని పంపమని వేడగా

నిత్యకృత్యాలనుగూర్చి ఆందోళనం చెందవద్దని

నీవామెను మందలించావు

భగవంతుణ్ణి ధ్యానించుకోవడం ముఖ్యమని వాకొన్నావు

మరియ ధ్యానశీలతను మెచ్చుకొన్నావు