పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

28. రెక్కలు విరిగిన పక్షి

ఈ పశ్చాత్తాపంగూడ ప్రభువు అనుప్రించే వరం. మనంతట మనం పాపం చేయగలమేగాని పశ్చాత్తాపపడలేం. పాపం జేసినపుడు రెక్కలు విరిగిన పక్షిలాగ, ఊబిలో దిగబడిన జంతువులాగ, సాలీని గూటిలో జిక్కుపడిన పురుగు లాగ నిస్సహాయ స్థితిలో వుండిపోతాం. ప్రభువు కరుణిస్తేగాని ఈ పాపావస్థను దాటిమల్లా బయట పడలేం. అందుకే "ప్రభూ నీవు మా మనసు మార్చు అప్పడు మేమ మనసు మార్చుకుంటాం" అంటాడు యిర్మీయీ ప్రవక్త - 31, 18. "ప్రభూ, నాలోని రాతి హృదయాన్ని తీసివేసి దానిస్థానే విధేయాత్మకమైన నిర్మల హృదయాన్ని నెలకొల్పు" అంటాడు యెహెజ్కేలు ప్రవక్త -11, 19. "ప్రభూ! నన్ను బలంగా ఆకర్షించు అప్పడు నేను నీ వైపు ఆకర్షింపబడతాను" అంటుంది పరమ గీతంలోని ప్రియురాలు - 1,4. పాపియైన నరుడు రేయింబవళ్లు మననం జేసికోవలసిన మహా వాక్యాలివి!

29. నాలుగు వంతులు నష్టపరిహారం - లూకా 19,8

ఈలా పశ్చాత్తాపపడినంక మన పాపాలను ప్రభువు నెదుట ఒప్పకోవాలి. ఒప్పకొని పాపపు ప్రవర్తనం మార్చుకుంటానని ప్రమాణం చేయాలి. జక్కయ బీదల నోళ్లుకొట్టి ధనం కూడబెట్టాడు. కాని ఓమారు పరివర్తనం చెందాక తన పాపపు జీవితం మార్చుకుంటానని ప్రమాణం చేసాడు. తన ఆస్తిలో సగభాగం బీదలకిస్తానన్నాడు. నోళ్లగొట్టి అన్యాయంగా లాగుకున్న డబ్బునకు నాలుగంతలుగా నష్టపరిహారం చెల్లిస్తానన్నాడు. ఈ నాలుగు వంతులు నష్టపరిహారం, సగం ఆస్తి దానం చేయడం, ఇవన్నీగూడ అతని చిత్తశుద్ధిని యదార్థమైన పరివర్తనను తెలియ జేస్తాయి. అతడు మళ్లి పాపపు త్రోవ త్రోక్కడని ప్రమాణ పూర్వకంగా హామీయిస్తాయి. మన పశ్చాత్తాపానికి గూడ ఈలాంటి గట్టి మాటపట్టు అంటూ వండాలి.

30. ఓ షరతు

మన పాపాలకు పరిహారం పొందాలి అంటే ఓ షరతును పాటించాలి. ప్రభువు మనలను క్షమించాలని ఏలా కోరుకుంటున్నామో అలాగే మనమూ ఇరుగుపొరుగువారిని క్షమిస్తుండాలి. "మీరు పొరుగువారి అపరాధాలను క్షమింపకపోతే మీ తండ్రి గూడ మీ యపరాధాలను క్షమించడు" అని ప్రభువు రూఢిగా జెప్పాడు - మత్త 6,15. పైగా క్షమాపణం పొందిగూడ తాను క్షమింపనొల్లని సేవకుని కథ మనకు తెలుసు. "నేను నిన్ను కరుణించిన రీతినే నీవను నీ తోడి దాసుని కరుణించవలదా" అని యజమానుడు