పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆ సేవకుని గద్దించాడు — మత్త 18, 33. కనుక మనకు ఎవరిమీద గూడ దీర్ఘకోపం, దీర్ఘకాలపుపగ పనికిరాదు. బైబులు బోధించే భగవంతుడు క్షమాపరుడు. అతన్ని కొలిచే క్రైస్తవ ప్రజలుకూడ సులభంగా క్షమించడం నేర్చుకోవాలి.

31. పాపులలో నేను ప్రధానుడను - 1తిమొు 1,15

పౌలు తొలుత క్రైస్తవులను హింసించాడు. ఆలా హింసించడంద్వారా క్రీస్తునకే ద్రోహం చేసాడు. కాని ప్రభువు మాత్రం ఇతన్ని క్షమించి నమ్మకమైనవాడని తలంచి తన పరిచర్యకు నియోగించుకున్నాడు. తరువాత పౌలు క్రీస్తుకోసం ఎంతో కృషి చేసాడు. ఎన్నోవేల మైళ్ళ ప్రయాణంచేసి ఎన్నో క్రైస్తవ సమాజాలు నెలకొల్పాడు. ఎంతో మందికి క్రీస్తును బోధించాడు. ఎన్నో జాబులు వ్రాసి క్రీస్తును గూర్చిన వేదసత్యాలెన్నో ప్రతిపాదించాడు. ఐనా ఈ పౌలు జీవితాంతం వరకూ తాను మహా పాపినని చెప్పకున్నాడు. జీవితాంతం వరకూ హృదయంలో పశ్చాత్తాపాన్ని పాదుకొల్పుకున్నాడు. చివరిరోజుల్లో తిమోతికి వ్రాసిన మొదటి జాబుతో, పాపుల్లో నేను ప్రధానుడ్డి అని చెప్పకున్నాడు. పౌలులాంటివాణ్ణి క్షమిస్తే ఇక ప్రభువు మమ్మ మాత్రం క్షమించడా అని పాపులు ధైర్యము తెచ్చుకోవడం కోసం, ఇక రాబోయ్యే పొళ్లకు తనను ఓ ఉదహరణంగా వుంచడం కోసం, ప్రభువు తన్ను క్షమించాడు అని వ్రాసికున్నాడు - 1 తిమో 1, 13-17. ఈలా మహా భక్తులు తాము పాపుల మనకున్నారు. జీవితాంతమూ తమ పాపాల కోసం పశ్చాతాపపడుతూ వచ్చారు. ఇక అల్పులమూ యాధార్థ పాపులమూ ఐన మనం, రోజురోజు స్వీయ పాపాల కోసం పశ్చాత్తాప పడుతూండవద్దా?

32. మీకు సమాధానం కలగాలి - యోహా 20, 20.

ఉత్తానక్రీస్తు శిష్యులకు దర్శనమిచ్చినప్పడు మీకు సమాధానం కలగాలి అని చెపూ వుండేవాడు. క్రీస్తు సిలువ మరణం వల్ల మనకు పాపపరిహారం లభించింది. కనుక ఉత్తాన క్రీస్తు నరులందరకు సమాధానాన్ని అందిస్తాడు. మనం పాపాలకు శ్చాత్తాపపడేపుడు కూడ ఈ ఉత్థాన క్రీస్తు సమాధానాన్ని పొందుతూంటాం. అందుకే పశ్చాత్తాపపడేపుడు హృదయం ఎంత భారంగా వుంటుందో క్షమాపణ పొందాక అంత తేలికగా వుంటుంది. ఈ హృదయ సమాధానం మనకు అనుభవం పూర్వకంగా తెలిసిన సత్యమే. కనుక పాపాలను తలంచుకొని నిత్యం పశ్చాతాపపడదాం. పశ్చాత్తాప ఫలితమైన హృదయ శాంతిని అనుభవిద్దాం. క్రీస్తు సమాధానాన్ని చవిచూద్దాం.

ఇంతవరకు పశ్చాత్తాప ప్రార్థనను గూర్చి విచారించాం. ఇక కృతజ్ఞతా ప్రార్థనను గూర్చి ఆలోచిద్దాం.