పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/203

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

7. నీవు వూల్లోకి వెళ్లావు. ప్రభువుకూడ నీ వెంటవచ్చాడు. అప్పడు నీవు రోజూ అలవాటుప్రకారం చేసే పనులు చేస్తావా లేక వాటిని మానుకొంటావా?
8. ప్రభువు మీ యింటవుండగా నీతో మాట్లాడ్డానికి వచ్చే స్నేహితులను జూచి నీవు సిగ్గుపడవుకదా?
9. ఆ ప్రభువు మీ ఇంటినీ, నిన్నూ నీ జీవిత విధానాన్నీ మెచ్చుకొంటాడా?
10. ఆ ప్రభువు ఇంకా ఒకటి రెండురోజులు మీ ఇంటిలో గడుపుతానంటే నీకు సమ్మతంగా వుంటుందా? నీవు ప్రాణాలు గుప్పిట పట్టుకొని అతడెప్పడెప్పడు వెళ్ళిపోతాడా అని కాచుకొని వండవా?

ప్రార్ధనం

ప్రభూ!అబ్రాహాము లాంటి పుణ్యపురుషులు నీ సన్నిధిలో నడిచారు. నీకు ప్రియపడేలా జీవించారు. నీవు నిత్యమూ నన్ను గమనిస్తూనే వుంటావని నమ్మి నేను వళ్ళ దగ్గర బెట్టుకొని జీవించేలా చేయి. నీవు నన్ను రక్షించేవాడివి కాని శిక్షించేవాడివి కాదని విశ్వసించి నీపట్ల నమ్మకంతో జీవించే భాగ్యం కూడ ప్రసాదించు – ఆమెన్.