పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/202

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

40. సన్యాస జీవితానికి తగినట్లుగా ఇంద్రియ నిగ్రహాన్ని పాటిస్తుంటానా?
41. ఇతరులతో నేను చేసే స్నేహాలు, పెట్టుకొనే సంబంధాలు నిర్మలంగాను పవిత్రంగాను వుంటాయా?
42. శరీర విషయంలో ఒకమారు పెద్దత్యాగం చేసాక, ఇప్పడు మళ్ళా అల్పసుఖాలకు పాల్పడ్డం లేదు కదా?

ప్రార్ధనం

ఓ ప్రభూ! మేము మూడు ప్రతాలతోను సామూహిక జీవితంతోను పవిత్ర జీవనం గడపి నీ కుమారునికి అతి సన్నిహితులమయ్యే భాగ్యాన్ని దయచేసావు. నీ కరుణద్వారా ఈ మఠజీవితాన్ని నిర్మలంగా జీవించే భాగ్యాన్ని గూడ మాకు దయచేయి - ఆమెన్

13. ప్రభువు మీ యింటికి అతిథిగా వస్తే?

ప్రభువు తలవని తలంపుగా మీ యింటికి అతిథిగా విచ్చేసాడు. అతడు మీ యింటిలో రెండుమూడు రోజులు ఉండాలనుకొంటున్నాడు. అప్పడు నీ ప్రవర్తనం ఏలా వుంటుంది?

1. ప్రభువు మీ యింటికి రావడాన్ని జూచి నీవు కంగారు పడవుగదా? అతన్ని హృదయపూర్వకంగా మీ యింటిలోనికి ఆహ్వానిస్తావా లేక అతన్ని చూడగానే నీ మొగం వెలవెల పోతుందా?
2. నీవు చదివే పుస్తకాలూ పత్రికలూ అతని కంటబడకుండా దాచాలనిపిస్తుందా? మీ యింటిలోని పటాలనూ బొమ్మలనూ తీసి ప్రక్కన పెట్టాలనిపిస్తుందా? ఇంకా అతని కంటపబడకుండా ఏయే వస్తువులు దాచాలనిపిస్తుంది?
3. ప్రభువు మీ యింటిలో వుండగా నీవు రోజూ అలంకరించుకొనే తీరుననే అలంకరించుకొంటూవా?
4. నీవు ప్రభువు సమక్షంలో రోజూ మీ యింటిలో వాడే భాషనే వాడతావా లేక నీ వాగ్లోరణని సవరించుకోవాలనిపిస్తుందా?
5. అతని సమక్షంలో నీవు రోజూ మీ యింటిలో చేసే పనులే చేస్తావా లేక వాటిని సవరించుకోవాలనిపిస్తుందా?
6.ప్రభువు చూస్తుండగా మీ యింటిలోని కుటుంబ సభ్యులపట్ల నీవు రోజు మెలిగే తీరుననే మెలుగుతావా లేక నీ చిర్రుబుర్రులను సరిదిద్దుకొంటావా?